China earthquake today : చైనాలో భూకంపం.. 110మంది మృతి- భారీగా ఆస్తి నష్టం!
China earthquake today : చైనాలో సంభవించిన భూకంపం ధాటికి.. 100మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు!
China earthquake today : భూకంపం ఘటనతో చైనా ఉలిక్కిపడింది. వాయువ్య చైనాలోని గాన్సూ రాష్ట్రంలో స్థానిక కాలామానం ప్రకారం సోమవారం అర్థరాత్రి సమయంలో భూమి కంపించింది. ఈ ఘటనలో 110కుపైగా మంది ప్రజలు మరణించినట్టు తెలుస్తోంది. వందలాది మంది గాయపడినట్టు సమాచారం.
చైనా అధికారుల ప్రకారం.. గాన్సూకు 100 కి.మీల దూరంలోని ఖింఘై వద్ద భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైందని స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. కాగా.. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం.. భూకంపం తీవ్రత 5.9 అని చెబుతోంది.
చైనాలో భూకంపం ఘటనలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తోంది! భూ ప్రకంపనలతో.. అప్పటి వరకు నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి.. రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయినట్టు సమాచారం.
Gansu earthquke live updates : చైనాలో భూకంపం ఘటనపై ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ వెంటనే స్పందించారు. సహాయక చర్యలను వెంటనే మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. భూకంప బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా భూకంపం ఘటనతో గాన్సూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. నీటి సరఫరా కూడా దెబ్బతినట్టు అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి.
చైనాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో 5.4 తీవ్రతతో తూర్పు చైనాలో సంభవించిన భూకంపం ధాటికి 23మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు కుప్పకూలాయి. 2022 సెప్టెంబర్‌లో 6.6 తీవ్రతో, సిచౌన్ రాష్ట్రంలో భూమి కంపించగా.. 100మంది మరణించారు.
China earthquake latest news : 2008లో 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపం..చైనా ప్రజలకు పీడకలగా మిగిలిపోయింది. నాడు.. 87వేల మంది ప్రాణాలు కోల్పోయారు/ గల్లంతయ్యారు. వేలాది మంది గాయపడ్డారు.
ప్రపంచం పరిస్థితి కూడా ఇదే..!
ప్రపంచవ్యాప్తంగ భూకంపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, నేపాల్, మెక్సికో దేశాలు భూ ప్రకంపనలతో వణికిపోతున్నాయి. నేపాల్‌లో నవంబర్‌లో వచ్చిన భూకంపానికి 140మంది బలయ్యారు. ఇక అఫ్గానిస్థాన్‌లో అక్టోబర్‌లో వచ్చిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య 2వేలు దాటింది.
Delhi earthquake today : ఉత్తర భారతంలో కూడా భూకంపాలు తరచూ ప్రజలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా దిల్లీ, లక్నో వంటి రద్దీ ఉందే ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
సంబంధిత కథనం