Monkeypox death : దేశంలో తొలి మంకీపాక్స్​ మరణం.. కేరళలో!-indias 1st monkeypox death patient dies in kerala probe ordered ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monkeypox Death : దేశంలో తొలి మంకీపాక్స్​ మరణం.. కేరళలో!

Monkeypox death : దేశంలో తొలి మంకీపాక్స్​ మరణం.. కేరళలో!

Sharath Chitturi HT Telugu
Jul 31, 2022 09:41 PM IST

Monkeypox death : మంకీపాక్స్​ లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి.. కేరళలోని త్రిస్సూర్​లో మరణించాడు. ఫలితంగా దేశంలో తొలి మంకీపాక్స్​ మరణం నమోదైంది.

<p>దేశంలో తొలి మంకీపాక్స్​ మరణం.. కేరళలో!</p>
దేశంలో తొలి మంకీపాక్స్​ మరణం.. కేరళలో! (HT_PRINT)

Monkeypox death : దేశంలో తొలి మంకీపాక్స్​ మరణం నమోదైంది. ఇతర దేశంలో మంకీపాక్స్​ వైరస్​కు పాజిటివ్​గా తేలిన వ్యక్తి.. కేరళలోని త్రిసూర్​లో శనివారం మరణించాడు. ఫలితంగా ఆఫ్రికా బయట మంకీపాక్స్​కు ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై స్పందించిన కేరళ ఆరోగ్యమంత్రి వీనా జార్జ్​.. "మంకీపాక్స్​ లక్షణాలతో మరణించిన వ్యక్తి వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాము. విదేశాల్లో అతనికి పాజిటివ్​ అని తేలింది. చికిత్స కోసం కేరళ త్రిస్సూర్​కు వచ్చారు," అని వివరించారు.

చికిత్స పొందడంలో ఆలస్యమైందా? అన్న కోణంలో విచారణ చేపడతామని వినా జార్జ్​ వెల్లడించారు.

దేశంలో ఇప్పటివరకు 4 మంకీపాక్స్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా.. దేశవ్యాప్తంగా అనేకచోట్ల.. మంకీపాక్స్​ లక్షణాలు ఉన్న అనుమానితుల వార్తలు బయటకొస్తున్నాయి.

తాజా ఘటనతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. మంకీపాక్స్​ తీవ్రత చాలా తక్కువ అని అంటున్నారు.

మంకీపాక్స్​- చికెన్​ పాక్స్​ మధ్య తేడా ఏంటి?

వైద్య నిపుణుల ప్రకారం.. మంకీపాక్స్​ అనేది జంతువుల నుంచి మనుషలకు వ్యాపించింది. ఈ లక్షణాలు స్మాల్​ పాక్స్​ని కూడా పోలి ఉన్నాయి. కానీ దానితో పోల్చుకుంటే మంకీపాక్స్​ తీవ్రత చాలా తక్కువ.

Monkeypox symptoms in Telugu : మంకీపాక్స్​ అనేది ముందు జ్వరంతో మొదలవుతుంది. ఆ తర్వాత.. తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, అస్వస్థత కూడా వస్తాయి. శరీరంలో వాపులు కూడా గుర్తించవచ్చు. చర్మం మీద దద్దుర్లు ఏర్పడే నాలుగు రోజుల ముందు ఈ లక్షణాలు ఉంటాయి. చేతుల నుంచి కళ్లకు ఆ తర్వాత శరీరానికి వ్యాపిస్తాయి.

"చికెన్​ పాక్స్​తో పోల్చుకుంటే.. మంకీపాక్స్​లో దద్దుర్లు చాలా పెద్దగా ఉంటాయి. మంకీపాక్సలో తొలుత దద్దుర్లు చేతులు, అరికాళ్లల్లో కనిపిస్తాయి. చికెన్​ పాక్స్​ వల్ల కలిగే దద్దుర్లు 7-8 రోజుల్లో పోతాయి. కానీ మంకీపాక్స్​లో అలా కాదు. చికెన్​ పాక్స్​లో దద్దుర్ల దురదపెడతాయి. కానీ మంకీపాక్స్​లో దద్దుర్లు దురద పెట్టవు," అని ఫార్టిస్​ మెమోరియల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​కు చెదిన డా. సతీష్​ కౌల్​ వెల్లడించారు.

చికెన్​ పాక్స్​తో పోల్చుకుంటే మంకీపాక్స్​లో వచ్చే జ్వరం.. ఎక్కువ రోజులు ఉంటుందని కౌల్​ వివరించారు.

చికెన్​ పాక్స్​తో పోల్చుకుంటే.. మంకీపాక్స్​తో మనిషిలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్