Monkeypox vs Chickenpox : మంకీపాక్స్​- చికెన్​ పాక్స్​ లక్షణాల మధ్య తేడా ఏంటి?-monkeypox vs chickenpox know the key differences between symptoms ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Monkeypox Vs Chickenpox: Know The Key Differences Between Symptoms

Monkeypox vs Chickenpox : మంకీపాక్స్​- చికెన్​ పాక్స్​ లక్షణాల మధ్య తేడా ఏంటి?

Sharath Chitturi HT Telugu
Jul 31, 2022 08:25 PM IST

Monkeypox vs Chickenpox : మంకీపాక్స్​- చికెన్​ పాక్స్​ మధ్య తేడా ఏంటి? లక్షణాలను వేరువేరుగా ఎలా గుర్తించాలి? చికెన్​ పాక్స్​ సోకితే.. మంకీపాక్స్​ రాదా? వంటి ప్రశ్నలకు వైద్య నిపుణుల సమాధానాలు ఇవే..

మంకీపాక్స్​- చికెన్​ పాక్స్​ మధ్య తేడా ఏంటి?
మంకీపాక్స్​- చికెన్​ పాక్స్​ మధ్య తేడా ఏంటి? (AFP)

Monkeypox vs Chickenpox : మంకీపాక్స్​ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా భయపెడుతోంది. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరికొందరికి ఈ మంకీపాక్స్​ వ్యాధి సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ మంకీపాక్స్​ లక్షణాలు.. సాధారణంగా కనిపించే చికెన్​ పాక్స్​ లక్షణాలు పోలి ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు వాటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి?

ట్రెండింగ్ వార్తలు

ఇదీ తేడా..!

వైద్య నిపుణుల ప్రకారం.. మంకీపాక్స్​ అనేది జంతువుల నుంచి మనుషలకు వ్యాపించింది. ఈ లక్షణాలు స్మాల్​ పాక్స్​ని కూడా పోలి ఉన్నాయి. కానీ దానితో పోల్చుకుంటే మంకీపాక్స్​ తీవ్రత చాలా తక్కువ.

మంకీపాక్స్​ అనేది ముందు జ్వరంతో మొదలవుతుంది. ఆ తర్వాత.. తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, అస్వస్థత కూడా వస్తాయి. శరీరంలో వాపులు కూడా గుర్తించవచ్చు. చర్మం మీద దద్దుర్లు ఏర్పడే నాలుగు రోజుల ముందు ఈ లక్షణాలు ఉంటాయి. చేతుల నుంచి కళ్లకు ఆ తర్వాత శరీరానికి వ్యాపిస్తాయి.

"చికెన్​ పాక్స్​తో పోల్చుకుంటే.. మంకీపాక్స్​లో దద్దుర్లు చాలా పెద్దగా ఉంటాయి. మంకీపాక్సలో తొలుత దద్దుర్లు చేతులు, అరికాళ్లల్లో కనిపిస్తాయి. చికెన్​ పాక్స్​ వల్ల కలిగే దద్దుర్లు 7-8 రోజుల్లో పోతాయి. కానీ మంకీపాక్స్​లో అలా కాదు. చికెన్​ పాక్స్​లో దద్దుర్ల దురదపెడతాయి. కానీ మంకీపాక్స్​లో దద్దుర్లు దురద పెట్టవు," అని ఫార్టిస్​ మెమోరియల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​కు చెదిన డా. సతీష్​ కౌల్​ వెల్లడించారు.

Monkeypox symptoms in Telugu : చికెన్​ పాక్స్​తో పోల్చుకుంటే మంకీపాక్స్​లో వచ్చే జ్వరం.. ఎక్కువ రోజులు ఉంటుందని కౌల్​ వివరించారు.

చికెన్​ పాక్స్​తో పోల్చుకుంటే.. మంకీపాక్స్​తో మనిషిలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.

చికెన్​ పాక్స్​ వస్తే.. మంకీపాక్స్​ సోకదా?

గతంలో చికెన్​ పాక్స్​ వస్తే ఇప్పుడు మంకీపాక్స్​ సోకదా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

"రెండు వ్యాధులు.. రెండు వేరువేరు వైరస్​ వల్ల కలుగుతాయి. వ్యాపించే తీరు కూడా వేరువేరుగా ఉంటుంది. అందువల్ల.. చికెన్​ పాక్స్​ సోకితే.. మంకీపాక్స్​ రాదు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు," అని ఢిల్లీలోని బీఎల్​కే మ్యాక్స్​ ఆసుపత్రికి చెందిన డా. రాజేందర్​ కుమార్​ సింగల్​ వెల్లడించారు.

స్మాల్​ పాక్స్​ నివారణకు టీకాలు తీసుకున్న వారికి.. మంకీపాక్స్​ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నాయి. అయితే.. 1980 తర్వాత స్మాల్​ పాక్స్​ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్