Independence Day 2023: మన స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత, చరిత్ర తెలుసా?
Independence Day 2023: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దాదాపు 200 సంవత్సరాల వలస పాలనకు ఆ రోజుతో తెరపడింది. భారతీయుల స్వయంపాలనకి తెరలేచింది. అందువల్ల ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 15 భారతీయులందరికీ జాతి, కుల, మత, వర్గాలకు అతీతంగా పండుగరోజు.
Independence Day 2023: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దాదాపు 200 సంవత్సరాల వలస పాలనకు ఆ రోజుతో తెరపడింది. భారతీయుల స్వయంపాలనకి తెరలేచింది. అందువల్ల ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 15 Independence Day భారతీయులందరికీ జాతి, కుల, మత, వర్గాలకు అతీతంగా పండుగరోజు.
మహాత్మా గాంధీ నాయకత్వంలో..
ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. భారతదేశ చరిత్రలో అదొక మైలురాయి. వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనలో భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో నష్టపోయింది. ఆ తరువాత క్రమంగా దేశ ప్రజల్లో చైతన్యం పెరిగింది. వలస పాలనకు వ్యతిరేకంగా ఒక్కటవ్వడం ప్రారంభించారు. తమకు సాధ్యమైన విధానాల్లో పోరాటం సాగించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన తరువాత.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి ఒక వేదిక లభించింది. ఆ తరువాత, మహాత్మా గాంధీ సమర్థ నాయకత్వంలో దేశమంతా ఒక్కటిగా సత్యాహింసలు ఆయుధాలుగా పోరాటం సాగించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అహింసాయుత మార్గంలో భారత్ స్వాతంత్రం సాంపాదించింది.
ఈ సంవత్సరం థీమ్..
తప్పని తప్పని పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్ పై అధికారాన్ని వదులుకుంది. ఆగస్టు 15 1947లో భారత్ కు స్వాతంత్రం లభించింది నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా వందనం చేసి భారతీయులంతా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2023 ఆగస్టు 15న మనం జరుపుకునేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ గా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్ (Nation First, Always First)’ అనే థీమ్ ని నిర్ణయించింది ఈ థీం ఆధారంగానే ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉంటాయి.
ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్
స్వాతంత్ర దినోత్సవ చరిత్ర బ్రిటిష్ వలస పాలకులు భారత్ కు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఇచ్చారు. అయితే అంతకుముందే, జులై 4 1947న బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత జూలై 18 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ రూపొందింది. భారత జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. ఆగస్టు 15 1947న పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతంలో తొలిసారి రెడ్ ఫోర్ట్ లోని లాహోరీ గేటు వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు.