Import tax on gold : బంగారంపై భారీగా పెరిగిన దిగుమతి సుంకం.. ధరల పరిస్థితి?-import tax on gold hiked prices surge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Import Tax On Gold : బంగారంపై భారీగా పెరిగిన దిగుమతి సుంకం.. ధరల పరిస్థితి?

Import tax on gold : బంగారంపై భారీగా పెరిగిన దిగుమతి సుంకం.. ధరల పరిస్థితి?

Sharath Chitturi HT Telugu
Jul 01, 2022 10:40 AM IST

Import tax on gold : బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5శాతం నుంచి 12.5శాతానికి పెంచింది ప్రభుత్వం.

బంగారంపై భారీగా పెరిగిన దిగుమతి సుంకం..
బంగారంపై భారీగా పెరిగిన దిగుమతి సుంకం.. ((REUTERS)

Import tax on gold : బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం ఓ నోటిఫికేషన్​ను జారీ చేసింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5శాతం నుంచి 12.5శాతానికి పెంచింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దిగుమతి సుంకంతో పాటు బంగారంపై 3శాతం జీఎస్​టీని విధిస్తోంది ప్రభుత్వం. గతేడాది బడ్జెట్​ సమయంలో 7.5శాతానికి బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది.

ప్రపంచంలో బంగారం దిగుమతిని చేసుకుంటున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్​ ఉంది. ఇక్కడ బంగారం వినియోగం ఎక్కువే. అందుకే దిగుమతులు కూడా ఎక్కువగా ఉంటాయి. డాలరుతో పోల్చితే రూపాయి రికార్డు స్థాయిలో పతనమవుతుండటంతో దిగుమతుల వ్యయంపై ఒత్తిడి పెరుగుతోంది.

ఎంసీఎక్స్​లో గోల్డ్​ రేట్లు.. 3శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 51,900గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మాత్రం శుక్రవారం తగ్గాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్