IDBI ESO Recruitment : రూ. 29వేల జీతంతో బ్యాంకు ఉద్యోగాలు- అప్లికేషన్‌కి ఈరోజే లాస్ట్ డేట్..
ఐడీబీఐ ఈఎస్ఓ రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్, పోస్టుల ఖాళీలు, జీతం సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాంకు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ముఖ్యమైన సమాచారం! ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ - సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్ఓ) పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు నవంబర్ 16, 2024న ముగియనుంది. ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ (idbibank.in) ద్వారా డైరెక్ట్ లింక్ పొందొచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1000 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వం/ ప్రభుత్వ సంస్థలు అంటే ఏఐసీటీఈ, యూజీసీ మొదలైన వాటి ద్వారా గుర్తింపు పొందిన/ ఆమోదించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు అక్టోబర్ 2, 1999 కంటే ముందు, అక్టోబర్ 1, 2004 తర్వాత జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
ఐడీబీఐ ఈఎస్ఓ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోండి..
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని అనుసరించవచ్చు.
- idbibank.in ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు ఈఎస్ఓ పోస్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు ‘అప్లై ఆన్లైన్’ లింక్ వస్తుంది.
- దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
- ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేసుకోండి. తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి.
అప్లికేషన్ ఫీజు..
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.250 (కేవలం సమాచార ఛార్జీలు), ఇతర అభ్యర్థులందరికీ రూ.1050(అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు). డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
శాలరీ, పోస్టుల వివరాలు..
ఉద్యోగంలో ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 29వేలు, రెండో ఏడాది నుంచి నెలకు రూ. 31వేల జీతం లభిస్తుంది.
- జనరల్ కేటగిరీ : 448 సీట్లు
- ఎస్టీ కేటగిరీ : 94 సీట్లు
- ఎస్సీ కేటగిరీ : 127 సీట్లు
- ఓబీసీ కేటిగిరీ: 231 సీట్లు
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీ: 100 సీట్లు
- పీడబ్ల్యూబీడీ కేటగిరీ: 40 సీట్లు
సంబంధిత కథనం