ICICI bank WhatsApp banking : వాట్సాప్ ద్వారా ఎఫ్డీ ఓపెన్ చేయండి ఇలా..
ICICI bank WhatsApp banking : మీకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉందా? అయితే.. మీకోసం వాట్సాప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని మరింత చేరువ చేసింది ఐసీఐసీఐ బ్యాంకు. ఆ వివరాలు..
ICICI bank WhatsApp banking : ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసింది. వాట్సాప్ ద్వారా.. వివిధ ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి మూడు లావాదేవీల వివరాలు, క్రెడిట్ కార్డు లిమిట్, ప్రీ అప్రూవ్డ్ ఇన్స్టంట్ లోన్ ఆఫర్ల, బ్లాక్/అన్‌బ్లాక్ క్రెడిట్- డెబిట్ కార్డుల వంటివి ఇక వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.
ఫలితంగా.. బ్యాంకులకు వెళ్లకుండానే.. యూజర్స్‌కు వారి చేతివెళ్ల వద్దకు బ్యాంకింగ్ సేవలను తీసుకొస్తోంది ఐసీఐసీఐ బ్యాంకు.
వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు పొందాలంటే..
- స్టెప్ 1:- 8640086400 ఈ నెంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోండి.
- స్టెప్ 2:- వాట్సాప్ ఓపెన్ చేసి.. ఆ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచే మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
- ICICI bank : స్టెప్ 3:- అందుబాటులో ఉన్న సేవలకు సంబంధించిన లిస్ట్.. మీకు రిప్లైగా వస్తుంది.
- స్టెప్ 4:- ఆ లిస్ట్‌లో నుంచి.. మీకు కావాల్సిన సేవలను ఎంపిక చేసుకోవాలి. అంతే..!
ఐసీఐసీఐ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవల లిస్ట్..
- అకౌంట్ బ్యాలెన్స్
- చివిరి మూడు లావాదేవీల వివరాలు
- క్రెడిట్ కార్డు లిమిట్
- బ్లాక్/ అన్‌బ్లాక్ కార్డులు
- ఇన్స్టంట్ లోన్
- ఇన్స్టాసేవ్
- ఫిక్స్డ్ డిపాజిట్లు
- బిల్ పేమెంట్
- ట్రేడ్ సర్వీసులు
ఐసీసీఐ బ్యాంకు వాట్సాప్ సేవలు- ఎఫ్డీ ఖాతా..
ICICI bank whatsapp services : వాట్సాప్ ద్వారా ఎఫ్డీ ఖాతా ఓపెన్ చేయడానికి.. ముందుగా , Fixed Deposit> వంటి కీవర్డ్స్‌ని టైప్ చేయాలి. ఎఫ్డీ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. రూ. 10వేల నుంచి రూ. 1కోటి మధ్యలో నగదును ఎంచుకునే అవకాశం ఉంది. కాల వ్యవధితో పాటు వడ్డీ రేట్లను చూపిస్తుంది. మీరు ఎంచుకున్న దాని బట్టీ.. మీ ఎఫ్డీ క్రియేట్ అవుతుంది.
వాట్సాప్ ద్వారా బిల్లులు చెల్లించడం ఎలా..?
ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్ల, పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్లుల కోసం సంబంధిత కస్టమర్ ఐడీలు టైప్ చేయాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డు లిమిట్ కోసం..
check credit card limit in whatsapp : ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు లిమిట్ చెక్ చేసుకోవడం కోసం.. వంటి కీవర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది.
ఇక సులభంగా.. చిటికెలో ఐసీఐసీ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా మీ పనులను పూర్తిచేసేయండి..!
సంబంధిత కథనం