IBPS RRB: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..-ibps rrb clerk results 2023 out heres link to check office assistant score ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Rrb: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

IBPS RRB: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Sep 01, 2023 07:50 PM IST

IBPS RRB clerk results 2023: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడయ్యాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను ibps.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IBPS RRB clerk results 2023: ఆర్ఆర్బీ క్లర్క్ పోస్ట్ ల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం ఐబీపీఎస్ వెల్లడించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్ బీ - ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్ట్ ల భర్తీ కోసం ఈ పరీక్షను ఐబీపీఎస్ నిర్శహించింది. ఈ రిజల్ట్స్ ibps.in. వెబ్ సైట్ లో సెప్టెంబర్ 7 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

మొత్తం 8 వేల పోస్ట్ లు..

ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్ లో జరిగే మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్ నెలలో జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా, క్లర్క్, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్ హోదాలకు చెందిన మొత్తం 8 వేల పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

How to check the result: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

  • ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం ముందుగా ibps.in. వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే IBPS RRB Group 'B' - Office Assistants (Multipurpose) results లింక్ పై క్లిక్ చేయాలి.
  • సంబంధిత బాక్స్ లో మీ వివరాలు నమోదు చేయాలి.
  • రిజల్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది.
  • రిజల్ట్ ను చెక్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

Whats_app_banner