Himachal Pradesh elections : 'వీర​భద్రుడి'పైనే భారం వేసిన కాంగ్రెస్​.. వ్యూహం ఫలించేనా?-himachal assembly polls congress to rely on former cm late virbhadra singh s legacy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Pradesh Elections : 'వీర​భద్రుడి'పైనే భారం వేసిన కాంగ్రెస్​.. వ్యూహం ఫలించేనా?

Himachal Pradesh elections : 'వీర​భద్రుడి'పైనే భారం వేసిన కాంగ్రెస్​.. వ్యూహం ఫలించేనా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 28, 2022 06:37 AM IST

Himachal Pradesh assembly elections 2022 : హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్​కు అత్యావసరం! ఇందుకోసం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. దివంగత నేత, మాజీ సీఎం వీర్​భద్ర సింగ్​ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచించింది. మరి కాంగ్రెస్​ ప్రయోగించిన ‘వీరభద్రుడి’ అస్త్రం ఫలిస్తుందా?

పార్టీ జెండాతో కాంగ్రెస్​ కార్యకర్తలు
పార్టీ జెండాతో కాంగ్రెస్​ కార్యకర్తలు (Jai Kumar)

Himachal Pradesh assembly elections 2022 : రోజులు గడుస్తున్న కొద్ది.. హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలుపు సాధించాలన్న కాంక్షతో బీజేపీ, కాంగ్రెస్​లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీరికి ఆప్​ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్​కు ఈ దఫా ఎన్నికలు ఎంతో కీలకం. దిగ్గజ నేత, మాజీ సీఎం వీర్​భద్ర సింగ్​ లేకుండా ఈసారి ఎన్నికల్లోకి వెళుతోంది కాంగ్రెస్​. కానీ ఆయన్ని మాత్రం వదులుకోలేదు! ఆయన సతీమణి ప్రతిభా సింగ్​కు రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చింది. వీర్​భద్ర సింగ్​ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓట్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్​ ప్రచారాలు, గెలుపుపై మాట్లాడారు ప్రతిభా సింగ్​. ఈసారి కాంగ్రెస్​ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రశ్న:- వీర్​భద్ర సింగ్​ లేని లోటు ఎలా ఉంది?

ప్రతిభా సింగ్​:- మాకు నేతల కొరత లేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల కోసం అందరిని దింపుతాము. వీర్​భద్ర సింగ్​ లేకుండానే ఈసారి ఎన్నికల్లోకి వెళుతున్నాము. అందరిని కలుపుకుని ఆయన ముందుకెళ్లేవారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తాము. ప్రచారాల్లో వీర్​భద్ర ఏదో ఒక రూపంలో ఉండాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఆయన చేసిన సేవలను ప్రజలు మర్చిపోలేదు. ఈసారి కచ్చితంగా గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము.

ప్రశ్న:- బీజేపీ ప్రచారాలపై మీ స్పందన?

Himachal Pradesh Congress : ప్రతిభా సింగ్​:- వీర్​భద్ర సింగ్​ చేసిన అభివృద్ధిని బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రాన్ని ఎవరు, ఎలా అభివృద్ధి చేశారన్నది ప్రజలకు గుర్తుంది. మన్మోహన్​ సింగ్​ హయాంలో రాష్ట్రానికి 4 వైద్య కళాశాలలు వచ్చాయి. మండీకి ఐఐటీ వచ్చింది. ఇలాంటివి ఎన్నో అభివృద్ధి కార్యకలాపాలు కాంగ్రెస్​ హయాంలో జరిగాయి. కానీ గత ఐదేళ్లల్లో సీఎం జైరాం ఠాకూర్​ ఏం చేయలేదు. వీర్​భద్ర సింగ్​ ప్రారంభించిన ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు అంతే! అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్​ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తారు.

ప్రశ్న:- టికెట్ల విషయంలో కాంగ్రెస్​ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయా?

ప్రతిభా సింగ్​:- పక్కా సర్వేలు నిర్వహించిన తర్వాతే టికెట్ల పంపిణీ జరుగుతోంది. కచ్చితంగా గెలిచే వారికే టికెట్లు ఇస్తున్నారు. టికెట్ల విషయంలో ఎవరు గొడవ పడటం లేదు. అసంతృప్తితో ఎవరైనా ఉంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారికి అవకాశాలు ఇస్తాము.

ప్రశ్న:- సీఎం పదవి రేసులో మీరు ఉన్నారా?

Himachal Pradesh polls 2022 : ప్రతిభా సింగ్​:- ఇది అసలు ప్రశ్నే కాదు. నేను సీఎం రేసులో లేను. అత్యధిక మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఇప్పుడు నా లక్ష్యం. ఆ తర్వాత ఎవరు సీఎం అవుతారు అన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుంది.

ప్రశ్న:- ఈ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ ప్రభావం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?

ప్రతిభా సింగ్​:- రాష్ట్రంలో ఆప్​ అంత ప్రభావం చూపించదు. బీజేపీ, కాంగ్రెస్​లో స్థానం సాధించలేకపోయిన చిన్న చిన్న నేతలు వెళ్లి ఆప్​లో చేరారు. ఆప్​ను ప్రజలు కోరుకోవడం లేదు.

ప్రశ్న:- ఎన్నికల ముందు లేదా ఆ తర్వాత.. మీరు బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. మీ స్పందన?

ప్రతిభా సింగ్​:- బీజేపీలో చేరడాన్ని నేను కలలో కూడా ఊహించుకోలేను. అలా అస్సలు జరగదు. వీర్​భద్ర సింగ్​ 60ఏళ్ల పాటు కాంగ్రెస్​కు సేవ చేశారు. నేనూ అదే చేస్తాను. నేను పార్టీ మారను.

ప్రశ్న:- కాంగ్రెస్​ టికెట్ల విషయంలో మీ తనయుడు సంతృప్తిగా ఉన్నారా?

Himachal Pradesh elections : ప్రతిభా సింగ్​:- కాంగ్రెస్​ అధిష్ఠానంపై విక్రమాదిత్య సింగ్​ సంతృప్తిగా ఉన్నారు. యువత, సీనియర్ల కలియికలో టికెట్లు ఇస్తున్నారని సంతోషిస్తున్నారు. వీర్​భద్ర చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విక్రమాదిత్య కృషిచేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు తాను చేసిన పనులపై ఓ రిపోర్ట కార్డు తయారు చేసుకున్నారు. తనని తాను నిత్యం మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నారు.

హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలు..

68 సీట్ల హిమాచల్​ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్​ 12న పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే 46మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​. వీర్​భద్ర సింగ్​ తనయుడు విక్రమాదిత్య.. ఈసారి శిమ్లా రూరల్​ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. కాగా.. 19మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలను వారి స్థానాల్లోనే మరోమారు బరిలో దింపుతోంది కాంగ్రెస్​.

Himachal Pradesh ele హిమాచల్​ ప్రదేశ్​లో అధికార మార్పిడి ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన బీజేపీ తర్వాత.. ఈసారి కాంగ్రెస్​ అధికారంలోకి రావాలి! మరి ఈసారి కాంగ్రెస్​ గెలుస్తుందా? లేకా బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? కాంగ్రెస్​ ప్రయోగిస్తున్న 'వీర్​భద్ర సింగ్​' అస్త్రం ఫలిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. డిసెంబర్​ 8 వరకు వేచి చూడాల్సింది!

IPL_Entry_Point

సంబంధిత కథనం