ఆయుధాలు, పేలుడు పదార్ధాలు నింపిన కారుతో తెలంగాణకు..! పోలీసుల అదుపులో నలుగురు
పంజాబ్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చేరవేసేందుకు పేలుడు పదార్ధాలతో వెళ్తున్న కారును హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఆదేశాలతో, ఎక్కడికి, ఎవరు లక్ష్యంగా ఆ పేలుడు పదార్ధాలు వెళ్తున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.
పంజాబ్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ చేరవేసేందుకు పేలుడు పదార్ధాలతో వెళ్తున్న కారును హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఆదేశాలతో, ఎక్కడికి, ఎవరు లక్ష్యంగా ఆ పేలుడు పదార్ధాలు వెళ్తున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.
అంబాలా - ఢిల్లీ జాతీయ రహదారిపై
గురువారం ఉదయం అంబాలా - ఢిల్లీ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక టయోటా ఇన్నోవా కారును బస్తారా టోల్ ప్లాజా వద్ద కర్నాల్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఆ వాహనానికి ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉంది. ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్ధాలతో ఆ కారు వెళ్తోందన్న ఇంటలిజెన్స్ బ్యూరొ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. అందులోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను తీసుకున్నారు. ఆ కారును సీజ్ చేశారు. ఆ కారులో నాలుగు బ్యాగుల్లో నింపి ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎవరు లక్ష్యంగా..
కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు పంజాబ్‌లోని లూథియానాకు చెందినవారిగా గుర్తించారు. వారు పంజాబ్ నుంచి పేలుడు పదార్ధాలతో తెలంగాణలోని ఒక ప్రాంతానికి వెళ్తున్నట్లు, వారి నుంచి రికవర్ చేసుకున్న మొబైల్ ఫోన్ల లోని సమాచారాన్ని బట్టి తెలుసుకున్నారు. ఆ కారు ఎవరిది? ఎక్కడి నుంచి, ఎక్కడికి వెళ్తోంది? ఎవరి ఆదేశాల మేరకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు తెలంగాణకు వెళ్తున్నాయి? అక్కడ ఎవరు వాటిని రిసీవ్ చేసుకుంటారు? ఎవరు లక్ష్యంగా వాటిని తెలంగాణ పంపుతున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కారు నిలిపిన ప్రాంతానికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ చేరుకుని, కారులోని ఆయుధాలు, పేలుడు పదార్ధాలను పరిశీలించింది. ఇన్నోవా నెంబర్ ప్లేట్ నిజమైనదా? కాదా? అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాదులా?
ఆ నలుగురిని ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. వారిని గురుప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపీందర్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిజెస్, 3 ఐఈడీలు, 6 మొబైల్ ఫోన్లు, 1.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిందా ఆ ఆయుధాలను డ్రోన్ ద్వారా పాకిస్తాన్ నుంచి పంజాబ్‌కు పంపినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ ఆయుధాలను ఒక యాప్ ద్వారా హర్జిందర్ సింగ్ పంపించారని, ఆ యాప్‌లో తెలంగాణ లోని ఆదిలాబాద్ లొకేషన్ కూడా ఉందని నిర్ధారించారు.
టాపిక్