GST rate hike : 'జీఎస్​టీ' పోటు.. మూడు రోజుల్లో భారీగా పెరగనున్న వస్తువుల ధరలు!-gst rate hike list of items to get costlier from next week ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gst Rate Hike : 'జీఎస్​టీ' పోటు.. మూడు రోజుల్లో భారీగా పెరగనున్న వస్తువుల ధరలు!

GST rate hike : 'జీఎస్​టీ' పోటు.. మూడు రోజుల్లో భారీగా పెరగనున్న వస్తువుల ధరలు!

Sharath Chitturi HT Telugu
Aug 07, 2023 02:14 PM IST

GST rate hike : రెండు రోజుల క్రితం జరిగిన జీఎస్​టీ సమావేశంలో పలు వస్తువులపై జీఎస్​టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జులై 18 నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.

<p>'జీఎస్​టీ' పోటు.. మూడు రోజుల్లో భారీగా పెరగనున్న వస్తువుల ధరలు!</p>
'జీఎస్​టీ' పోటు.. మూడు రోజుల్లో భారీగా పెరగనున్న వస్తువుల ధరలు! (REUTERS)

GST rate hike : బుధవారం జరిగిన జీఎస్​టీ మండలి సమావేశం.. ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అనేక వస్తువుల మీద జీఎస్​టీని పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జులై 18న పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి.

ఈ వస్తువులపై బాదుడే..!

ప్రింటింగ్​/రైటింగ్​ ఇంక్​, ఎల్​ఈడీ ల్యాంప్​లు, లైట్లు, మెటల్​ ప్రింటెడ్​ సర్క్యూట్​ బోర్డులపై ప్రస్తుతం ఉన్న 12శాతం జీఎస్​టీని 18శాతానికి పెంచారు.

సోలార్​ వాటర్​ హీటర్లు, సోలార్​ సిస్టమ్స్​ మీద 5శాతంగా ఉన్న జీఎస్​టీని 12శాతం చేశారు.

చెప్పుల తయారీ సంస్థలకు సంబంధించిన వివిధ పనులపై 5శాతంగా ఉన్న జీఎస్​టీని 12శాతంగా మార్చారు. రోడ్డు, బ్రిడ్జులు, రైల్వే, మెట్రో వంటి కాంట్రాక్టు పనులపై ఉన్న రేటును 12శాతం నుంచి 18శాతానికి తీసుకెళ్లారు.

టెట్రా ప్యాక్​పై ఉన్న 12శాతం జీఎస్​టీని 18శాతంగా మార్చారు. పాలిష్డ్​ డైమండ్​ రేట్​ను 0.25శాతం నుంచి ఏకంగా 1.5శాతానికి పెంచేశారు.

ఇవి కూడా..

  • కత్తులు, కట్టింగ్​ బ్లేడ్లు, పేపర్​ నైఫ్​లు, పెన్సిల్​ షార్ప్​నర్​లు, స్పూన్లు, ఫోర్క్​లు- 18శాతం.
  • విద్యుత్​తో పనిచేసే పంపులు, బైసైకిల్​ పంపులు- 18శాతం
  • మిల్లింగ్​ పరిశ్రమలో వినియోగించే యంత్రాలు, విత్తనాల కోసం ఉపయోగించే యంత్రాలు, వెట్​ గ్రైండర్లు- 18శాతం.
  • నగదు విత్​డ్రా చేసుకునేందుకు వినియోగించే చెక్​లు- 18శాతం
  • అట్లాస్​లు, వాల్​ మ్యాప్​లు- 12శాతం
  • హోటల్​ వసతు రూ.1000(రోజుకు) దాటితే 12శాతం
  • ఆసుపత్రుల్లో రూమ్​ రెంటు రోజుకు రూ. 5వేలు దాటితే 5శాతం.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్