Crime news : 14ఏళ్ల బాలికపై రౌడీ అత్యాచారం​.. సిగరెట్​తో కాల్చి, గుండు కొట్టించి..!-goon rapes minor girl singes her with cigarette butts in akola city of maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : 14ఏళ్ల బాలికపై రౌడీ అత్యాచారం​.. సిగరెట్​తో కాల్చి, గుండు కొట్టించి..!

Crime news : 14ఏళ్ల బాలికపై రౌడీ అత్యాచారం​.. సిగరెట్​తో కాల్చి, గుండు కొట్టించి..!

Sharath Chitturi HT Telugu
Nov 21, 2023 06:48 AM IST

Crime news : ఓ రౌడీ షీటర్​.. ఓ 14ఏళ్ల బాలికను రేప్​ చేశాడు. ఆమెను సిగరెట్​తో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

14ఏళ్ల బాలికపై రౌడీ అత్యాచారం​.. సిగరెట్లతో కాల్చి, గుండు కొట్టించి..!
14ఏళ్ల బాలికపై రౌడీ అత్యాచారం​.. సిగరెట్లతో కాల్చి, గుండు కొట్టించి..!

Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పేరుమోసిన రౌడీ షీటర్​.. ఓ 14ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా.. సిగరెట్​తో ఆమె శరీరాన్ని కాల్చి, తలకు గుండు కొట్టించాడు!

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర అకోలా నగరంలో జరిగింది ఈ ఘటన. ఖాదాన్​ అనే ప్రాంతంలో.. గణేశ్​ కుమ్రే అనే 29ఏళ్ల రౌడీ ఉన్నాడు. అతనికి క్రిమినల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉంది. కాగా.. స్థానికంగా కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తెపై అతని కన్నుపడింది. ప్రస్తుతం ఆమె వయస్సు 14ఏళ్లు. కుమ్రే.. ఆ బాలికను రెండేళ్లుగా వేధిస్తున్నాడు!

ఈ నెల 15న, 16వ తేదీల్లో.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు కుమ్రే. సిగరెట్​ బట్స్​తో చిత్రహింసలకు గురిచేశాడు. జట్టు కత్తిరించేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు.. ఆగ్రహంతో ఊగిపోయారు. కుమ్రేకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rowdy sheeter raped minor : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి.. ఈ నెల 18న కుమ్రేని అరెస్ట్​ చేశారు. ఐపీసీ సెక్షన్​ 363, 354, 376 కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్​కు తరలించారు.

'బాధితురాలికి న్యాయం చేస్తాము..'

ఓ రౌడీ.. బాలికను రేప్​ చేసి, చిత్రహింసలు గురిచేశాడన్న విషయం.. మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​.. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.

Man raped minor girl : "నిందితుడిని విడిచిపెట్టాము. కఠినంగా శిక్షిస్తాము. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాను," అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి దేవేంద్ర ఫడణవీస్​ మీడియాకు వెల్లడించారు.

ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత కథనం