Google Doodle on pani puri: ‘పాని పూరి’పై గూగుల్ డూడుల్; ఇంతకీ.. ఈ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ను కనిపెట్టింది ఎవరో తెలుసా?
Google Doodle on pani puri: భారతదేశంలోనే కాదు.. దక్షిణాసియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్న ప్రతీ చోటా ఫేమస్ ఈ పానీ పూరీ. ఈ ఫేమస్ స్ట్రీట్ స్నాక్ ను రుచి చూడని భారతీయులు చాలా, చాలా తక్కువ. పానీ పూరి ని జులై 12న గూగుల్ గుర్తు చేసింది. గూగుల్ డూడుల్ తో ఒక ఇంటరాక్టివ్ గేమ్ ను అందించింది.

Google Doodle on pani puri: గూగుల్ డూడుల్
2015 లో ఇదే రోజు మన పానీ పూరి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Golden Book of World Records) లోకి చేరింది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న ఒక రెస్టారెంట్ 15 ప్రత్యేకమైన ఫ్లేవర్లతో పానీ పూరీని తయారు చేసి కస్టమర్లకు అందించింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇలా డూడుల్ ను రూపొందించింది. ఈ డూడుల్ ఒక ఇంటరాక్టివ్ గేమ్ గా గూగుల్ రూపొందించింది. యూజర్ ఈ గేమ్ లో తనకు నచ్చిన ఫ్లేవర్లలో పానీ పూరీని ఆర్డర్ ఇస్తూ, స్కోర్ చేయవచ్చు.
Popular street food: పాపులర్ స్ట్రీట్ ఫుడ్
ఈ సందర్భంగా పానీ పూరీ ప్రాముఖ్యతను గూగుల్ వివరించింది. దక్షిణాసియాలో పానీ పూరీ చాలా ఫేమస్ అని, క్రిస్పీగా ఉండే చిన్న గుండ్రటి పూరీలో ఆలూ మసాలా, బఠానీ మొదలైనవి వేసి, పచ్చిమిర్చీ, పుదీనా, కొత్తిమీర వాటర్ తో కలిపి కస్టమర్లకు అందిస్తారు. భారత్ లో ఇది చాలా ఫేమస్ ఈవినింగ్ స్ట్రీట్ స్నాక్. దీన్ని పానీ పూరీ, గోల్ గప్పా, ఫుచ్కా.. తదితర పేర్లతో పిలుస్తారు.
Pani puri first made by?: మొదట తయారు చేసింది ఎవరంటే?
పానీ పూరీని మొదట తయారు చేసింది మహాభారత కాలంలో పంచ పాండవుల ధర్మ పత్ని అయిన ద్రౌపది అట. పాండవులు అజ్ఞాత వాసంలో ఉంటూ, ఇబ్బందులు పడుతున్న సమయంలో.. వంటగదిలో వంటకు సంబంధించిన ఆహార ధాన్యాలు, ఇతర దినుసులు లేకపోవడంతో, అత్తగారైన కుంతీమాత సలహా ప్రకారం.. ద్రౌపది ఇలా పానీ పూరీ తయారు చేసి, పాండవుల ఆకలి తీర్చిందని చెబుతుంటారు.