Gold Silver Rate Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు….-gold and silver prices across various cities in india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Silver Rate Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు….

Gold Silver Rate Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు….

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 06:08 AM IST

Today Gold and Silver Price: కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నా ఆదివారం దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా మారాయి. గత వారాంతం నుంచి మార్కెట్లలో ధకలె స్థిరంగా మారాయి. ఇవాళ కూడా అవే ధరలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,200గా ఉంది. మరోవైపు ఇవాళ వెండి రేటు కూడా స్థిరంగానే ఉంది.

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు (Mohammad Aleemuddin)

Gold silver price today 10 october 2022: బంగారం ధరల్లో గత కొద్ది నెలలుగా పెరుగుదల నమోదవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండగా కూడా సోమవారం కూడా ఎలాంటి మార్పులు లేవు.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,200గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.47,850 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ ‌లో కిలో వెండి ధర రూ.66,000గా ఉంది

Gold silver price today: ఏపీలో బంగారం ధరలు ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47,850గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 52,200గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 66,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,000గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360 వద్ద కొనసాగుతోంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,900గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 వద్ద ఉంది. కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 52,200గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,850 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 60 చొప్పున పెరిగింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 24,290గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 24,290గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం కొన్ని నెలలుగా బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.

IPL_Entry_Point