Full emergency at Delhi airport: విమానం విండ్ షీల్డ్ పై పగులు; ఢిల్లీ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ-full emergency declared at delhi airport after air india plane lands with crack in windshield ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Full Emergency Declared At Delhi Airport After Air India Plane Lands With Crack In Windshield

Full emergency at Delhi airport: విమానం విండ్ షీల్డ్ పై పగులు; ఢిల్లీ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (File/ Reuters)

Full emergency at Delhi airport: విండ్ షీల్డ్ పై చిన్న పగులు ఏర్పడడంతో మంగళవారం సాయంత్రం పుణె - ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ఫుల్ ఎమెర్జెన్సీ ప్రకటించి, షెడ్యూల్డ్ టైమ్ కన్నా ముందే ల్యాండ్ చేశారు.

Full emergency at Delhi airport: విండ్ షీల్డ్ పై చిన్న పగులు ఏర్పడడంతో పుణె - ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ఫుల్ ఎమెర్జెన్సీ ప్రకటించి, షెడ్యూల్డ్ టైమ్ కన్నా ముందే ల్యాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Full emergency at Delhi airport: విండ్ షీల్డ్ పై పగులుతో..

మంగళవారం సాయంత్రం 5.44 గంటల సమయంలో పుణె నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా AI858 విమానం విండ్ షీల్డ్ పై చిన్న పగులు ఏర్పడడంతో, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమెర్జెన్సీ ప్రకటించి, షెడ్యూల్డ్ టైమ్ కన్నా ముందే ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. విండ్ షీల్డ్ కు కుడివైపు (minor crack on the right (starboard side)) చిన్న పగులు గుర్తించిన పైలట్లు వెంటనే ల్యాండింగ్ కు అనుమతి కోరారు. దాంతో, వెంటనే ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించి, మిగతా విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాలలో మార్పులు చేసి, ఈ ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ చేయడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

WhatsApp channel