EMRS Notification 2023 : ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 10,391 పోస్టులు, దరఖాస్తులకు అక్టోబర్ 19 లాస్ట్ డేట్
EMRS Notification 2023 : ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. ఈ నెల 19 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
EMRS Notification 2023 : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్(EMRS)లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 10,391 పోస్టుల భర్తీకి దరఖాస్తులు గడువు మరోసారి పొడిగించారు. అక్టోబర్ 19 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ద్వారా గుర్తింపు పొందిన మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ పొందిన అభ్యర్థులు పీజీటీ, టీజీటీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అక్టోబర్ 19 చివరి తేదీ
నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ ఏడాది జూన్ చివరిలో నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 4,062 పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్ గెస్ట్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, గెస్ట్ లెక్చరర్, ల్యాబ్ అటెండెంట్, కుక్, హెల్పర్, స్వీపర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. అక్టోబర్ 19 లోపు అధికారిక వెబ్‌సైట్ recruitment.nta.nic.inని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 10, 391 పోస్టులు
ఈ ఏడాది జూన్ లో 4,062 పోస్టులకు ఆ తర్వాత కొద్ది రోజులకు మరో 6,329 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తంగా 10,391 పోస్టులను భర్తీ చేయనున్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు ఇవ్వనున్నారు.
4,062 పోస్టుల నోటిఫికేషన్‌లో
- ప్రిన్సిపల్-303
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)-2266
- అకౌంటెంట్-361
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్‌ఏ)- 759
- ల్యాబ్ అటెండెంట్-373
6,329 పోస్టుల నోటిఫికేషన్ లో
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) - 5660
- హాస్టల్ వార్డెన్(పురుషులు) -335
- హాస్టల్ వార్డెన్ (మహిళలు) -334
ఈఎమ్ఆర్ఎస్ పోస్టుల వయోపరిమితి
- ప్రిన్సిపాల్ - 50 ఏళ్లు మించకూడదు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)-40 ఏళ్లు మించకూడదు
- అకౌంటెంట్- 30 ఏళ్లు మించకూడదు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)- 30 ఏళ్లు మించకూడదు
- ల్యాబ్ అటెండెంట్- 30 సంవత్సరాల వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా
- ఎన్టీఏ emrs.tribal.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- EMRS రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపాలి.
- దరఖాస్తుదారులు EMRS ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత , సబ్జెక్ట్ వివరాలను పూరించాలి.
- ఆ తర్వాత సిస్టమ్‌లో వచ్చిన అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
- అభ్యర్థి ఫొటో (10Kb - 200Kb), సంతకాన్ని (4kb - 30kb) jpg/jpeg ఫార్మెట్ అప్‌లోడ్ చేయండి.
- ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, ఇతర పత్రాలు (50 kb- 300 kb) అప్‌లోడ్ చేయాలి.
- ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు రుసుమును SBI/ కెనరా బ్యాంక్/ HDFC బ్యాంక్/ ICICI బ్యాంక్/ Paytm చెల్లింపు ద్వారా డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్/ UPI ద్వారా చెల్లించాలి.
- చివరిగా దరఖాస్తును సబ్మిట్ చేయాలి. దరఖాస్తు PDF ఫామ్ ను సేవ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాలకు ప్రింట్‌ను తీసుకోండి.