Nirmala Sitharaman budget news | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజులో భాగంగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. రాజ్యసభలో 2021-22 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఆంగ్లం, హిందీ భాషల్లో సర్వే పత్రాలను సర్వేను సభ ముందుకు తీసుకొచ్చారు.
సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్యసభ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇటీవల మరణించిన ఎంపీలు, నేతలకు.. పెద్దల సభ సభ్యులు నివాళులర్పించి, కొంతసేపు మౌనం పాటించారు.
ఆ తర్వాత.. ఆర్థిక సర్వేతో పాటు స్టాటిస్టికల్ అపెండిక్స్ను సభలో ప్రవేశపెట్టారు నిర్మల. అనంతరం పెద్దల సభ.. మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
Economic Survey 2022 | అంతకుముందు.. నిర్మలా సీతారామన్.. ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. ఇది గతేడాది 3.6 శాతంగా ఉంది.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం కేంద్ర బడ్జెట్ను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు ఆర్థికమంత్రి.
సంబంధిత కథనం