Kejriwal in Gujarat: `బీజేపీలోనే ఉండండి.. ఆప్ కోసం పని చేయండి`
Kejriwal in Gujarat: గుజరాత్ లోని బీజేపీ కార్యకర్తలకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వింత ఆఫర్ ఇచ్చారు. బీజేపీలోనే ఉంటూ, వారిచ్చే డబ్బు తీసుకుంటూ, ఆప్ కోసం పని చేయాలని వారికి సూచించారు.
Kejriwal in Gujarat: గుజరాత్ ప్రజలు బీజేపీ పై చాలా కోపంగా ఉన్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. గుజరాత్ లోని సూరత్ లో కేజ్రీవాల్ శనివారం పర్యటించారు.
Kejriwal in Gujarat: 12లో ఏడు సీట్టు ఆప్ వే..
బీజేపీ గూండాయిజంపై గుజరాత్ ప్రజల ఆగ్రహం ఆప్ పై ఓట్ల రూపంలో పడనుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సూరత్ పట్టణంలో తాము సర్వే చేయించామని, పట్టణంలోని 12 సీట్లలో 7 స్థానాల్లో ఆప్ గెలవనుందని ఆ సర్వేలో తేలిందని వెల్లడించారు. 27 ఏళ్ల పాలనలో బీజేపీ గూండాయిజం తప్ప ప్రజలకేం ఇవ్వలేదన్నారు.
Kejriwal in Gujarat: పార్టీ కార్యకర్తపై దాడి..
సూరత్ లోని ఒక గణేశ్ మండపం వద్ద ఆప్ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. గణేశ్ విగ్రహం ముందే ఆప్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పై దాడి చేశారని, అదే గణేశ్ విగ్రహం ముందు తాను హారతి ిస్తున్నానని, ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని సవాలు చేశారు. ‘మీరు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ను కాదు. ఆమ్ ఆద్మీ పార్టీని. మేం భగత్ సింగ్ వారసులం. మేం భయపడం. మేం తిరిగి పోరాడుతాం’ అని హెచ్చరించారు. ఓటమి భయంతోనే బీజేపీ ఈ దాడులు చేస్తోందన్నారు.
Kejriwal in Gujarat: ఆ డబ్బులు తీసుకోండి..
బీజేపీ ఇచ్చిన డబ్బులు తీసుకుని, ఆప్ కోసం పని చేయాలని బీజేపీ కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచించారు. బీజేపీ వద్ద డబ్బు ఉందని, తమ వద్ద లేదని వ్యాఖ్యానించారు. ‘మాకు బీజేపీ నేతలు అక్కర్లేదు. బీజేపీ కార్యకర్తలు, గ్రామ, బూత్ స్థాయి కార్యకర్తలు మాకు కావాలి. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అందే ప్రయోజనాలు వారికీ అందుతాయి’ అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆప్ అందరికీ నాణ్యమైన వైద్యం, విద్య, విద్యుత్ అందిస్తుందన్నారు.