Padma Awards 2023 list: ములాయం సింగ్ యాదవ్, ఎస్ ఎం కృష్ణలకు పద్మ విభూషణ్-dilip mahalanabis who pioneered use of ors to be awarded padma vibhushan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Padma Awards 2023 List: ములాయం సింగ్ యాదవ్, ఎస్ ఎం కృష్ణలకు పద్మ విభూషణ్

Padma Awards 2023 list: ములాయం సింగ్ యాదవ్, ఎస్ ఎం కృష్ణలకు పద్మ విభూషణ్

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 10:16 PM IST

Padma Awards 2023 list: వివిధ రంగాల్లో విశేష సేవలను అందించినవారికి భారత ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ (Padma Awards) పురస్కారాలను ప్రకటించింది. వారిలో 6 మందికి పద్మ విభూషణ్ (Padma Vibhushan), 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మ శ్రీ పురస్కారం లభించింది.

ములాయం సింగ్ యాదవ్
ములాయం సింగ్ యాదవ్

Padma Awards 2023 list: భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన వారిలో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, కర్నాటకకు చెందిన ఎస్ ఎం కృష్ణ, జాకిర్ హుస్సేన్, బాలకృష్ణ దోషి, శ్రీనివాస వరధాన్ తదితరులున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం 9 మందికి ప్రముఖులకు పద్మ భూషణ్ ప్రకటించింది. పద్మ భూషణ్ పొందిన వారిలో కర్నాటకు చెందిన బైరప్ప, బిజినెస్ మ్యాన్ కుమార మంగళం బిర్లా, తమిళనాడు నుంచి వాణి జయరాం, తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో స్వామి చిన జియర్ స్వామి, మహారాష్ట్ర నుంచి సుమన్ కళ్యాణపుర్, కర్నాటక నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి, తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో కమలేశ్ డీ పటేల్ తదితరులున్నారు. వీరు కాకుండా, మరో 91 మందికి పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించారు.

‘Padma’ awards announced: దిలీప్ మహాలనబీస్ కు పద్మ విభూషణ్

‘Padma’ awards announced: పశ్చిమ బెంగాల్ కు చెందిన 87 ఏళ్ల డాక్టర్ దిలీప్ మహాలనబీస్ (Dilip Mahalanabis) కు ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించారు. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఓఆర్ ఎస్ కు (Oral Rehydration Solutions ORS) కు ప్రాచుర్యం కల్పించి, లక్షలాది ప్రాణాలను ఆయన (Dilip Mahalanabis) కాపాడారు. అమెరికా నుంచి వచ్చి, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో శరణార్ధుల శిబిరాల్లో ORS విధానంలో సేవలను అందించి వేలాది మందిని (Dilip Mahalanabis) కాపాడారు. ఈ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల ప్రాణాలు రక్షించబడ్డాయి. నోటి ద్వారా ఔషధాలను, ఇతర ముఖ్యమైన న్యూట్రియెంట్లను పంపించే ఈ విధానంతో భారత్ లో కలరా, డయేరియా, డీ హైడ్రేషన్ తదితర వ్యాధుల నుంచి లక్షలాది శిశువులు, పిల్లల ప్రాణాలను కాపాడగలిగారు.

IPL_Entry_Point