Padma Awards 2023: చినజీయర్‌కు పద్మభూషణ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు వీరికే -padma awards 2023 winners from telugu states check full list here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Padma Awards 2023 Winners From Telugu States Check Full List Here

Padma Awards 2023: చినజీయర్‌కు పద్మభూషణ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు వీరికే

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 10:03 PM IST

Telugu States Get Padma Awards: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పలువురు ఎంపికయ్యారు. వీరిలో చినజీయర్ స్వామిజీతో పాటు ఎంఎం కీరవాణి ఉన్నారు.

తెలుగు రాష్ట్రాలకు పద్మ అవార్డులు
తెలుగు రాష్ట్రాలకు పద్మ అవార్డులు

‘Padma Awards 2023 List: ’పద్మ' అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా ఈ ఏడాది 106 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించగా.. ఇందులో 6 మందికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో పలువురు తెలుగువారికి చోటు దక్కింది. ఇందులో తెలంగాణ నుంచి ప్రొఫెసర్‌ బి రామకృష్ణారెడ్డి పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక కాగా, ఏపీ నుంచి సామాజికి కార్యకర్త సంకురాతిరి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ వరించింది. గిరిజన భాషలన పరిరక్షించినందుకు రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కగా, వైద్య విద్యా రంగంలో పేదలకు ఉచిత సేవలు అందించినందుకు గాను చంద్రశేఖర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది.

ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ నుంచి స్వామి చినజీయర్ తో పాటు ఇదే రంగంలో తెలంగాణకు చెందిన కమలేష్ డి పటేల్ కు పద్మభూషణ్ పురస్కారం దక్కాయి. ఇక సైన్స్ ఇంజనీరింగ్ రంగంలో తెలంగాణకు చెందిన మోదడుగు విజయ గుప్తాకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికవ్వగా.. ఇదే రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణేష్ నాగప్ప కృష్ణ నారా జనగరకు కూడా దక్కింది. మెడిసిన్ విభాగంలో తెలంగాణకు చెందిన పసుపులేటి హనుమంతరావుకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది.

కళా రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సి.వి రాజుకు పద్మశ్రీ పురస్కారం రాగా.. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అబ్బా రెడ్డి నాగేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కళా రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోట సచ్చిదానంద శాస్త్రికి పద్మశ్రీ పురస్కారం వరించింది. సామాజిక సేవా రంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణికి ఏపీ నుంచి పద్మ శ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రం వివరాలను వెల్లడించింది.

పద్మభూషణ్ అవార్డులు

-స్వామి చినజీయర్ - తెలంగాణ

-కమలేష్ డి పటేల్ - తెలంగాణ

పద్మశ్మీ అవార్డులు

-మోదడుగు విజయ్ గుప్తా - తెలంగాణ

-ఎం.ఎం కీరవాణీ - ఆంధ్రప్రదేశ్

-గణేశ్ నాగప్ప - ఆంధ్రప్రదేశ్

-హనుమంత్ రావ్ - తెలంగాణ

-సీవీ రాజు - ఆంధ్రప్రదేశ్

-అబ్బారెడ్డి నాగేశ్వరరావు - ఆంధ్రప్రదేశ్

-బీ రామకృష్ణారెడ్డి - తెలంగాణ

-కోటా సచ్చితానంద శాస్త్రి - ఆంధ్రప్రదేశ్

-చంద్రశేఖర్ - ఆంధ్రప్రదేశ్

NOTE: పద్మ అవార్డుల జాబితాను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడవచ్చు

IPL_Entry_Point

సంబంధిత కథనం