Crime : కారు పార్కింగ్​ కోసం గొడవ.. రాళ్లు- ఇటుకలతో కొట్టి చంపేశారు!-delhi crime news man dies over honking parking argument ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime : కారు పార్కింగ్​ కోసం గొడవ.. రాళ్లు- ఇటుకలతో కొట్టి చంపేశారు!

Crime : కారు పార్కింగ్​ కోసం గొడవ.. రాళ్లు- ఇటుకలతో కొట్టి చంపేశారు!

Sharath Chitturi HT Telugu
Jul 19, 2022 12:36 PM IST

Delhi Crime news : కారులో అర్ధరాత్రి వేళ స్నేహితులతో బయటకు వెళ్లాడు ఆ వ్యక్తి. మెట్రో స్టేషన్​ గేట్​ వద్ద పార్కింగ్​కు ప్రయత్నించాడు. కానీ ఓ ఆరుగురు అక్కడే నిలబడి ఉన్నారు. పక్కకు జరగాలని వారిని అడిగాడు. వారు వినలేదు. చివరికి గొడవ మొదలైంది. ఆ ఆరుగురు.. ఆ వ్యక్తిని రాళ్లు, ఇటుకలతో కొట్టి చంపేశారు. ఢిల్లీలో జరిగింది ఈ ఘటన.

కారు పార్కింగ్​ కోసం గొడవ.. రాళ్లు- ఇటుకలతో కొట్టి చంపేశారు!
కారు పార్కింగ్​ కోసం గొడవ.. రాళ్లు- ఇటుకలతో కొట్టి చంపేశారు! (HT Telugu)

Delhi Crime news : ఢిల్లీలో కారు పార్కింగ్​పై మొదలైన గొడవ.. ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఆరుగురు కలిసి.. ఓ 32ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు!

పార్కింగ్​పై గొడవ..

ఢిల్లీలోని సాకెత్​ మెట్రో స్టేషన్​ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. మెట్రో స్టేషన్​ దగ్గర ఓ వ్యక్తి.. రక్తపుమడుగులో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లేసరికి అక్కడ ఆ వ్యక్తి లేడు. అతడిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుసుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత.. ఆ వ్యక్తికి సంబంధించిన స్నేహితుడిని పోలీసులు కలిసి విచారించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది.

రోహిత్​ అనే వ్యక్తి.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి శనివారం అర్ధరాత్రి సమయంలో కారులో బయటకు వెళ్లాడు. మెట్రో స్టేషన్​ గేట్​.2 వద్ద కారును పార్క్​ చేద్దామని ప్రయత్నించాడు. కానీ అప్పటికే అక్కడ ఆరుగురు నిలబడి ఉన్నారు. హారన్​ కొట్టిన రోహిత్​.. పక్కకు జరగాలని ఆ ఆరుగురికి చెప్పాడు. వారు కదలలేదు. దీంతో కారులో నుంచి కిందకి దిగి.. వారి వద్దకు వెళ్లాడు రోహిత్​. చివరికి గొడవ ముదిరింది.

రోహిత్​ను పట్టుకున్న ఆ ఆరుగురు.. పక్కనే ఉన్న రాళ్లు, ఇటుకలతో కొట్టారు. రోహిత్​ తలకు బలమైన గాయమైంది. అతడి​ శరీరం నుంచి రక్తం బయటకు రావడం మొదలైంది. చివరికి రోహిత్​ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.

ఈ ఘటన 1:30 గంటలకు జరగ్గా.. తెల్లవారముజామున 4:30 గంటల ప్రాంతాల్లో రోహిత్​ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చివరికి.. నిందితుల్లో ఒకడైన 22ఏళ్ల ప్రియాన్షూ అనే వ్యక్తిని అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా.. అతను నేరాన్ని అంగీకరించాడు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్