Delhi crime news : లైంగిక దాడిని భరించలేక.. టీచర్‌ను గొంతు కోసి చంపిన బాలుడు!
Delhi crime news : ఓ 14ఏళ్ల బాలుడు.. తన టీచర్‌ను చంపిన ఘటన దిల్లీలో వెలుగులోకి వచ్చింది. టీచర్ చేస్తున్న లైంగిక దాడిని తట్టుకోలేకే.. బాలుడు అతడిని చంపేశాడు.
Delhi crime news : దిల్లీలో మరో క్రైమ్ వార్త వెలుగులోకి వచ్చింది. 28ఏళ్ల ట్యూషన్ టీచర్ని గొంతు కోసి చంపేశాడు ఓ బాలుడు. తనపై జరుగుతున్న లైంగిక దాడిని తట్టుకోలేకే హత్య చేశాడు!
ఇదీ జరిగింది.
దిల్లీలోని జామియా నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ 30 మధ్యాహ్నం 2:15 గంటలకు పీసీఆర్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. జామియా నగర్‌లోని బాట్లా హౌజ్ రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ఓ మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెడపై కత్తి గాటు ఉండటాన్ని చూశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాధితుడి వివరాలను సేకరించారు. అతను జాకిర్ నగర్లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడని తెలుసుకున్నారు. అయితే అతను ఒక హోమోసెక్ష్యువల్ అని, రెండు నెలలుగా ఓ 14ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసుల ప్రాథమిక దర్యప్తులో తేలింది.
ఇదీ చూడండి:- Delhi crime news : దిల్లీలో దారుణం.. 85ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!
minor kills teacher in Delhi : నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. చివరికి శుక్రవారం నాడు ఆ 14ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే కారణంతోనే పదునైన ఆయుధంతో హత్య చేసినట్టు బాలుడు అధికారులకు వెల్లడించాడు.
"రెండు నెలల ముందు నేను అతడిని తొలిసారి కలిశాను. నాపై లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. మళ్లీ మళ్లీ రమ్మని పిలిచేవాడు. రాకపోతే.. వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించేవాడు. ఆగస్ట్ 30న కూడా నన్ను రమ్మని ఫోన్ చేశాడు. నేను ఇక సహించలేకపోయాను," అని బాలుడు.. పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
14 year old boy kills teacher : మరోవైపు.. ఘటన జరిగిన ఫ్లాట్, బాధితుడి కుటుంబానికి చెందినది అని తెలిస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు అది రెంట్‌కి ఉండేదని, కొన్ని రోజుల క్రితమే అది ఖాళీ అయ్యిందని సమాచారం. ఖాళీ అయిన వెంటనే.. ఆ ట్యూషన్ టీచర్.. బాలుడిని పిలిపించాడు. చివరికి బాలుడు అతడిని చంపేశాడు.
సంబంధిత కథనం