Delhi court shooting: ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పులు; ఇద్దరికి తీవ్ర గాయాలు-delhi court shooting debarred lawyer opens fire injures woman in abdomen hand ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Court Shooting: Debarred Lawyer Opens Fire, Injures Woman In Abdomen, Hand

Delhi court shooting: ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పులు; ఇద్దరికి తీవ్ర గాయాలు

HT Telugu Desk HT Telugu
Apr 21, 2023 02:47 PM IST

Delhi court shooting: ఢిల్లీలోని ఒక స్థానిక కోర్టులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సస్పెండైన ఒక లాయర్ జరిపిన కాల్పుల్లో ఒక మహిళ, ఒక లాయర్ తీవ్రంగా గాయపడ్డారు.

ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు జరిగిన అనంతర దృశ్యం
ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు జరిగిన అనంతర దృశ్యం

Delhi court shooting: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్ (Saket court complex) లో శుక్రవారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఒక మహిళ కాగా, మరొకరు న్యాయవాది. వారికి బుల్లెట్ గాయాలయ్యాయని, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించామని ఢిల్లీ సౌత్ డీసీపీ చందన్ చౌధరి తెలిపారు. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

Delhi court shooting: చీటింగ్ కేసు

గాయపడిన మహిళ పేరు రాధ అని, ఆమెకు 40 ఏళ్లని, ఆమెను సమీపంలోని మాక్స్ హాస్పిటల్ కు తరలించామని పోలీసులు తెలిపారు. ఆమెకు రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. ఒక బుల్లెట్ కడుపులోకి దూసుకుపోగా, మరొక బుల్లెట్ చేతికి తగిలింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. బుల్లెట్ గాయమైన మరో వ్యక్తిని న్యాయవాది రాజేందర్ ఝాగా గుర్తించామన్నారు. న్యాయవాదిగా సస్పెండైన వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. 4, 5 రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం అతడు వెనుకవైపు ఉన్న క్యాంటీన్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడని తెలిపారు. అతడు రాధ, లాయర్ రాజేందర్ ఝా లపై చీటింగ్ కేసు పెట్టాడని, ఆ కేసు విచారణ ఈ రోజు సాకేత్ కోర్టులో ఉందని పోలీసులు వివరించారు. బుల్లెట్ గాయాలతో రక్తమోడుతూ, బాధతో అరుస్తున్న బాధిత మహిళ రాధ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Delhi court shooting: కేజ్రీవాల్ స్పందన

ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల ఘటనపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వ్యాఖ్యానించారు.ఇతరుల విధులను ఆటంకపరుస్తూ, చిల్లర రాజకీయాలు చేయడానికి బదులుగా.. ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తే మంచిది’’ అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (Delhi LG) పై ట్విటర్ లో పరోక్ష విమర్శలు చేశారు. సరిగ్గా విధులు నిర్వర్తించలేకపోతే, రాజీనామా చేసి వెళ్లిపోవాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) సూచించారు. ‘‘ప్రజల రక్షణ బాధ్యతను శ్రీరాముడి భరోసాపై వదిలేయలేం’’ అని వ్యంగ్యంగా విమర్శించారు. ఢిల్లీలో శాంతి భద్రతల వ్యవస్థ లెఫ్టినెంట్ గవర్నర్ విధుల్లో భాగంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

WhatsApp channel

టాపిక్