First trans-person winner of MCD: ఎంసీడీ ఎన్నికల్లో ‘బాబీ డార్లింగ్’ గెలుపు-delhi chooses its first trans person member from aap ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  First Trans-person Winner Of Mcd: ఎంసీడీ ఎన్నికల్లో ‘బాబీ డార్లింగ్’ గెలుపు

First trans-person winner of MCD: ఎంసీడీ ఎన్నికల్లో ‘బాబీ డార్లింగ్’ గెలుపు

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 09:05 PM IST

MCD election results: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించినట్లే, ఊహించిన స్థాయిలో కాకపోయినా, ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 250 సీట్ల ఎంసీడీని 134 సీట్లలో విజయం సాధించి కైవసం చేసుకుంది.

ఎంసీడీ ఎన్నికల్లో గెలిచిన బాబీ డార్లింగ్
ఎంసీడీ ఎన్నికల్లో గెలిచిన బాబీ డార్లింగ్ (HT)

MCD election results: 15 ఏళ్ల తరువాత, ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కోల్పోయింది. ఆ పార్టీకి 104 సీట్లు లభించాయి. మూడో స్థానంలో సింగిల్ డిజిట్ 9 తో కాంగ్రెస్ నిలిచింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.

First Transgender winner: తొలి ట్రాన్స్ జెండర్

పైన చెప్పిన విశేషాలే కాకుండా, ఈ ఎన్నికలకు మరికొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి, తొలిసారి ఒక ట్రాన్స్ జెండర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంసీడీ ఎన్నికల్లో ఎల్జీబీటీ(LGBT) వర్గానికి చెందిన వ్యక్తి విజయం సాధించడం ఇదే తొలిసారి. సుల్తాన్ పురి స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బాబీ కిన్నార్ అలియాస్ బాబీ డార్లింగ్ విజయం సాధించారు. బాబీ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వరుణ్ ధాకాపై 6714 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. ఒక ట్రాన్స్ జెండర్ ను ఆప్ ఎన్నికల్లో నిలపడం ఇదే ప్రథమం.

change in society: మార్పు వస్తోంది..

సుల్తాన్ పురిని సుందరంగా తీర్చిదిద్దుతానని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని బాబీ డార్లింగ్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తెలిపారు. తన సంతోషానికి అవధులు లేవని, ఈ విజయం తన ట్రాన్స్ జెండర్ వర్గం వారందరికీ చెందుతుందని తెలిపారు. సమాజంలో ఇప్పుడు మార్పు వస్తోందని, తన లాంటి వారిని వేరుగా చూడడం తగ్గిపోయిందని అన్నారు. 70% ప్రజల్లో మార్పు వచ్చిందని, తమను యాక్సెప్ట్ చేయడం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రారంభంలో చాలా కష్టాలు, అవమానం ఎదుర్కొన్నానన్నారు.

Boby darling social service: 2017లోనూ పోటీ..

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బాబీ డార్లింగ్ 2017లో కూడా పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. LGBT హక్కుల కోసం చాన్నాళ్లుగా పోరాడుతున్నారు. హిందు యువ సమాజ్ ఎకతా ఆవామ్ కు ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. అన్నా హజారే ప్రారంభించిన లోక్ పాల్ ఉద్యమ సమయం నుంచి బాబీ డార్లింగ్ కు అరవింద్ కేజ్రీవాల్ తో పరిచయం ఉంది. 15 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో ఒక ట్రాన్స్ జెండర్ గురూజీకి బాబీని కుటుంబ సభ్యులు ఇచ్చేశారు.

Whats_app_banner

టాపిక్