CUET PG 2023: సీయూఈటీ పీజీ 2023 అడ్మిట్ కార్డ్స్ సిద్ధం; డౌన్ లోడ్ చేసుకోండి ఇలా-cuet pg 2023 admit card for 9 11 june exams out on cuetntanicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Pg 2023: సీయూఈటీ పీజీ 2023 అడ్మిట్ కార్డ్స్ సిద్ధం; డౌన్ లోడ్ చేసుకోండి ఇలా

CUET PG 2023: సీయూఈటీ పీజీ 2023 అడ్మిట్ కార్డ్స్ సిద్ధం; డౌన్ లోడ్ చేసుకోండి ఇలా

HT Telugu Desk HT Telugu
Jun 08, 2023 04:30 PM IST

CUET PG 2023: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ 2023 (CUET PG 2023) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CUET PG 2023: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ 2023 (CUET PG 2023) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ (CUET PG 2023 admit cards) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. జూన్ 9, జూన్ 10, జూన్ 11 తేదీల్లో వివిధ సబ్జెక్టులకు జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఇవి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 180 ప్రముఖ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్లను ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు. ఈ యూనివర్సిటీల్లో సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీలు ఉన్నాయి. ఈ అడ్మిట్ కార్డ్స్ ను విద్యార్థులు cuet.nta.nic.in. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

CUET PG 2023 admit cards: డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

జూన్ 9 నుంచి జూన్ 11 వరకు జరిగే సీయూఈటీ పీజీ 2023 పరీక్షలను రాసే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్స్ ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • సీయూఈటీ అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపిస్తున్న CUET PG 2023 Admit Card లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ లను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.
  • స్క్రీన్ పై మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని, సేవ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డు ను ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

ఇప్పటికే అడ్మిట్ కార్డు పొందిన విద్యార్థులు అందులో పేర్కొన్న ఎగ్జామ్ సెంటర్, తేదీ, షిఫ్ట్ ప్రకారం పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. జూన్ 9 నుంచి జూన్ 11 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ పరీక్షలకు సుమారు 1.86 లక్షల మంది హాజరు అవుతున్నారు.

Whats_app_banner