ICMR covid vaccines : భారత యువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకా కారణం కాదు!
ICMR covid vaccines : కొవిడ్ టీకాలతో భారత యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరిగిందని వస్తున్న రిపోర్టులను ఐసీఎంఆర్ కొట్టిపారేసింది. ఈ మేరకు ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది.
ICMR covid vaccines : భారతీయ యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని కొవిడ్ టీకాలు పెంచాయన్న వాదనలు సరికావని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెల్లడించింది. పోస్ట్ కొవిడ్ హాస్పిటలైజేషన్, లైఫ్‌స్టైల్, కుటుంబంలో ఆకస్మిక మరణాలు, అప్పటివరకు వెలుగులోకి రాని అనారోగాలు వంటివి కారణమని వివరించింది.
దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో పరిశోధనలు చేసి ఓ అధ్యయనాన్ని రూపొందించింది ఐసీఎంఆర్. ఈ క్రమంలో.. 2021 అక్టోబర్- 2023 మార్చ్ మధ్య కాలంలో.. ఆకస్మికంగా మరణించిన 18-45ఏళ్ల వయస్కుల వారి హెల్త్ హిస్టరీని కూడా పరిశీలించింది. వారి కొడివ్ వ్యాక్సినేషన్, కొవిడ్ అనంతర పరిస్థితులు, కుటుంబంలో ఆకస్మిక మరణాలు, స్మోకింగ్, డ్రగ్స్ అలవాట్లు (మరణానికి 48గంటల ముందు వరకు) వంటి అంశాలపై డేటాను సేకరించింది.
"ప్రస్తుతం స్మోక్ చేస్తున్నారా లేదా? మద్యం తాగుతున్నారా? డ్రగ్స్ తీసుకుంటున్నారా? వంటివి.. ఆకస్మిక మరణాలకు కారణాలుగా ఉన్నాయి. ఆ అలవాట్లేవీ లేని వారితో పోల్చుకుంటే.. అలవాట్లు ఉన్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది," అని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది.
Sudden death risk in Indians : కొవిడ్ అనంతరం దేశంలో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని, వీరిలో యువకులే ఎక్కువగా ఉన్నారన్న నివేదికలను దృష్టిలో పెట్టుకుని.. ఈ స్టడీని నిర్వహించింది ఐసీఎంఆర్.
"కొవిడ్ తీవ్రతను తగ్గించేందుకు టీకాలు ఉపయోగపడ్డాయి. రెండు టీకాలు తీసుకన్న వారిలో ఆకస్మిక మరణాల ప్రమాదం ఎక్కువగా కనిపించలేదు. ఒక డోసు తీసుకుంటే.. ఆకస్మిక మరణానికి కారణ అవ్వొచ్చు. ఇది కొవిడ్ సంబంధిత సమస్య వల్ల కావొచ్చు," అని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
Sudden death risk in Indians due to Covid : ఆకస్మిక మరణాలకు, కొవిడ్‌కి మధ్య ఏదైనా లింక్ ఉందా? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. ఇండియా విషయానికొస్తే.. యువకుల్లో ఆకస్మిక మరణాలపై ఇప్పటివరకు పెద్దగా దర్యాప్తు జరగలేదని పేర్కొంది.
అయితే.. కొవిడ్ కారణంగా గుండె సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. కానీ ఇవి లేకుండా.. రోగులు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం