ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1 రాకెట్…. కానీ!-countdown for isro maiden sslv d1 mission ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1 రాకెట్…. కానీ!

ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1 రాకెట్…. కానీ!

Mahendra Maheshwaram HT Telugu
Aug 07, 2022 07:42 AM IST

SSLV-D1/EOS-02 Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్ ‌(ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1) నింగిలోకి దూసుకెళ్లింది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని (షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది. అయితే ప్రయోగం సాంకేతిక సమస్యల తలెత్తినట్లు ఇస్రో గుర్తించింది. కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనుంది.

నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1 mission
నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1 mission (ANI)

SSLV-D1/EOS-02 Mission: ఇస్రో చేపట్టిన SSLV - D1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎస్ఎస్ఎల్వీ అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్. శ్రీహరి కోట లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం జరిగింది. ఆదివారం (ఆగస్టు 7) తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయి.. 9.18 నిమిషాలకు రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది.

ఇది షార్‌ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటిది పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ), జియోసింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. ఈ SSLV - D1 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-02 తో పాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ తయారు చేయించిన ఆజాదీ శాట్ ను 500 కిలో మీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని 75 స్కూళ్లకు చెందిన స్టూడెంట్స్ యారు చేశారు.

కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తి అయింది. 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించారు. ఈ శాటిలైట్స్ వివరాలు చూస్తే... ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలించనుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఇంకో ఉపగ్రహం ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని తయారు చేశారు.

ఇస్రో ఛైర్మన్ ప్రకటన...

SSLV-D1 అన్ని దశలను దాటిందన్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. టర్మినల్ దశలో కొంత సమాచారాన్ని కోల్పోయిందన్న ఆయన.. తుది ప్రకటనపై డేటాను విశ్లేషిస్తున్నట్లు ప్రకటించారు. రాకెట్ నుంచి సమాచారం అందటం లేదని... కొద్దిసేపట్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

‘4 దశలు దాటుకొని రాకెట్ వెళ్లింది. టర్మినల్ దశలో కొంత డేటా కోల్పోయింది. ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 4 వ దశలో సమస్య తలెత్తినట్లు గుర్తించాం. ఉపగ్రహాలు కక్ష్యలోకి వెళ్లాయా లేదా అనే దానిపై విశ్లేషిస్తున్నాం. ప్రయోగం పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం ఇస్తాం’ - ఇస్రో ఛైర్మన్

IPL_Entry_Point

టాపిక్