Cough Syrup Mafia: భారీ ‘దగ్గు సిరప్’ మాఫియాను పట్టుకున్న పోలీసులు: వేలాది బాటిళ్లు స్వాధీనం-cough syrup racket busted in odisha balangir ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cough Syrup Mafia: భారీ ‘దగ్గు సిరప్’ మాఫియాను పట్టుకున్న పోలీసులు: వేలాది బాటిళ్లు స్వాధీనం

Cough Syrup Mafia: భారీ ‘దగ్గు సిరప్’ మాఫియాను పట్టుకున్న పోలీసులు: వేలాది బాటిళ్లు స్వాధీనం

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 14, 2023 07:53 AM IST

Cough Syrup racket busted: అక్రమంగా దగ్గు సిరప్‍ను తయారు చేస్తున్న మాఫియాను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. భారీ స్థాయిలో సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_Print)

Cough Syrup racket busted: దగ్గు మందు (Cough Syrup) భారీ అక్రమ వ్యాపారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఒడిశా (Odisha) పోలీసులు.. ఓ దగ్గు సిరప్ మాఫియా (Cough Syrup Mafia)ను పట్టుకున్నారు. మిషన్ కాఫ్ సిరప్ (Mission Cough Syrup)లో భాగంగా రాష్ట్రంలో బలాన్‍గిర్ (Balangir) ప్రాంతంలో సోదాలు చేసి భారీగా సిరప్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్కఫ్ (Eskuf) అని రాసి ఉన్న వేలాది దగ్గు మందు బాటిళ్లను పట్టుకున్నారు. ఏకంగా 35 మంది అనుమానితులను అరెస్టు చేశారు బలాన్‍గిర్ పోలీసులు. వివరాలివే..

అక్రమంగా తయారీ, బెంగాల్ వరకు..

Cough Syrup racket busted: సనా నేగి, ప్రశాంత్ ఖేటి అనే ఇద్దరు ఈ దగ్గు సిరప్ రాకెట్‍ను నడుపుతున్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా దగ్గు సిరప్ తయారు చేయడం, రవాణా చేయడం, అమ్ముతుండటంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మాఫియా బలాన్‍గిర్‌లో దగ్గు సిరప్ తయారు చేసి పక్క జిల్లాలతో పాటు పశ్చిమ బెంగాల్ వరకు విక్రయిస్తోంది. ఈ చైన్‍ను పోలీసులు బద్దలుకొట్టారు. సిరప్ మాఫియాను అరికట్టేందుకు మిషన్ కాఫ్ సిరప్ కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో భాగంగానే దాడులు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

12వేల సిరప్ బాటిళ్లు స్వాధీనం

Cough Syrup racket busted: ఈ దాడుల్లో 12,960 ఎస్కఫ్ సిరప్ బాటిళ్లనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 ఫోన్లు, ఓ నాటు తుపాకీ, మహీంద్రా ఎక్స్‌యూవీ కారు, రెండు పికప్ వ్యాన్లు, ఓ టాటా ఏస్ వాహనం, రెండు బైక్‍లు, బంగారు ఆభరణాలతో పాటు మరిన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ కంపెనీకి చెందిన రూ.2కోట్ల మొత్తాన్ని స్థంబింపజేసినట్టు వెల్లడించారు.

Cough Syrup racket busted: మొత్తంగా రూ.35లక్షల విలువైన దగ్గు సిరప్ బాటిళ్లను పట్టుకున్నట్టు బలాన్‍గిర్ పోలీసులు తెలిపారు. తాము ఇంత వరకు పట్టుకున్న కాఫ్ సిరప్ మాఫియాలో ఇదే అతిపెద్దది అని వెల్లడించారు. “బలాన్‍గిర్‌లో ఎస్కఫ్ సిరప్‍ను అక్రమంగా ఉత్పత్తి చేస్తూ.. రవాణా, అమ్మకాలు చేస్తున్న రాకెట్‍ను పోలీసులు బయటపెట్టారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్, సేకరించిన ఆధారాలను బట్టి విచారణ చేస్తున్నాం. బలాన్‍గిర్ నుంచి పశ్చిమబెంగాల్ వరకు ఉన్న ఈ మొత్తం దగ్గు మాఫియా చైన్‍ను ధ్వంసం చేశాం” అని బలాన్‍గిర్ ఎస్‍పీ నితిన్ కుషాల్కర్ వెల్లడించారు.

Whats_app_banner