Chandrayaan-3: యూట్యూబ్ లో కూడా చంద్రయాన్ 3 రికార్డు
Chandrayaan-3: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం ఘన విజయం సాధించింది. చంద్రయాన్ 3 విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై బుధవారం సాయంత్రం సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ కాగలిగి, చరిత్ర సృష్టించింది. అయితే, చంద్రయాన్ 3 కి మరికొన్ని రికార్డులు కూడా ఉన్నాయి.
Chandrayaan-3: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం ఘన విజయం సాధించింది. చంద్రయాన్ 3 విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై బుధవారం సాయంత్రం సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ కాగలిగి, చరిత్ర సృష్టించింది. అయితే, చంద్రయాన్ 3 కి మరికొన్ని రికార్డులు కూడా ఉన్నాయి.
రికార్డుల మీద రికార్డులు..
చంద్రయాన్ 3 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై అడుగిడిన నాలుగో దేశంగా చంద్రయాన్ 3 ద్వారా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా కూడా భారత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు, చంద్రయాన్ కు మరో రికార్డు కూడా ఉంది. అతి తక్కువ బడ్జెట్ తో, సుమారు 75 మిలియన్ డాలర్ల స్వల్ప వ్యయంతో చంద్రయాన్ 3 ని ఇస్రో ప్రయోగించింది. ఈ బడ్జెట్ హాలీవుడ్ సినిమా ఇంటర్ స్టెల్లార్ బడ్జెట్ వంటి చాలా భారీ బడ్జెట్ సినిమాల కన్నా తక్కువ.
యూట్యూబ్ లో మరో రికార్డు..
చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్ పైననే ఉంది. చంద్రయాన్ 3 ప్రయోగంపై భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేకులు, ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు ఆసక్తి చూపుతున్నారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో లైవ్ స్ట్రీమ్ చేసింది. యూట్యూబ్ ఛానల్ లో, ఫేస్బుక్ పేజ్ లో, తమ వెబ్సైట్లో ఈ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసింది. అంతేకాదు ఇది దూరదర్శన్ ఛానల్లోనూ, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లోనూ, డిస్నీ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోను లైవ్ స్ట్రీమ్ అయింది. యూట్యూబ్ చానెల్ లో చంద్రయాన్ 3 ల్యాండింగ్ మరో రికార్డు సృష్టించింది. యూట్యూబ్ లో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను దాదాపు 80 లక్షల మంది లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించారు.
బ్రెజిల్, క్రొయేషియా ఫుట్ బాల్ మ్యాచ్
యూట్యూబ్ లో ఇది ఒక చరిత్ర. ఇంత పెద్ద సంఖ్యలో ఒక లైవ్ స్ట్రీమ్ ని ఇంతవరకు ఎవరు చూడలేదు. అంటే అత్యధికులు వీక్షించిన లైవ్ స్ట్రీమ్ గా చంద్రయాన్ 3 లాండింగ్ ప్రక్రియ నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు 2022 లో జరిగిన ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ సందర్భంగా బ్రెజిల్ క్రొయేషియాల మధ్య జరిగిన మ్యాచ్ కు ఉంది. ఆ మ్యాచ్ ను యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో సుమారు 61 లక్షల మంది చూశారు. రెండో స్థానంలో బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ల మధ్య జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ను సుమారు 52 లక్షల మంది యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు .ఇప్పుడు ఈ రికార్డులను ఇస్రో చంద్రయాన్ 3 లాండింగ్ లైవ్ స్ట్రీమింగ్ బద్దలు కొట్టింది. ఈ ల్యాండింగ్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా యూట్యూబ్ లో 80 లక్షల మంది వీక్షించారు.