BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ పై నిషేధం-centre orders blocking of tweets youtube videos on bbc documentary on pm modi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bbc Documentary On Pm Modi: ప్రధాని మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ పై నిషేధం

BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ పై నిషేధం

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 09:31 PM IST

BBC documentary on PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై, 2002 గుజరాత్ అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ ని ట్విటర్,యూట్యూబ్ ల్లో షేర్ చేయకుండా నిషేధం విధించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై బీబీసీ (BBC)రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) ని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విటర్, యూట్యూబ్ లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీ (BBC documentary) దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని, అందువల్ల ఆ డాక్యుమెంటరీ (BBC documentary)ని షేర్ చేయడాన్ని బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది.

BBC documentary on PM Modi: బీబీసీ డాక్యుమెంటరీ పై నిషేధం

ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ (BBC documentary) ని షేర్ చేయడాన్ని ట్విటర్, యూట్యూబ్ లు నిషేధించాయి. ఆ డాక్యుమెంటరీ షేర్ కాకుండా బ్లాక్ చేశాయి. ఇప్పటికే పబ్లిష్ అయిన వీడియోలను కూడా యూట్యూబ్ (YouTube) డిలీట్ చేసింది. అలాగే, ఆ డాక్యుమెంటరీ ని లింక్ చేసిన 50 కి పైగా ట్వీట్లను ట్విటర్ (Twitter) డిలీట్ చేసింది. అలా డిలీట్ చేసిన ట్వీట్లలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ కూడా ఉంది.

BBC documentary on PM Modi: అప్రతిష్ట పాలు చేయడానికే..

ప్రధాని మోదీని, భారత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రచార చిత్రంలా ఆ బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) ఉందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బ్రిటిష్ వలసవాద మనస్తత్వం అందులో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఆ డాక్యుమెంటరీ (BBC documentary) ని కేంద్ర విదేశాంగ, సమాచార ప్రసార, హోం శాఖ సీనియర్లు చూసి, అది భారత దేశ ఔన్నత్యాన్ని, సుప్రీంకోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని నిర్ణయానికి వచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను తక్కువ చేసే ప్రయత్నమని వారు విమర్శించారు. ఐటీ రూల్స్ ప్రకారం ఆ డాక్యుమెంటరీ (BBC documentary)ని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను ఆదేశించారు.

Whats_app_banner

టాపిక్