షిండేను బరువెక్కిన హృదయంతోనే సీఎంగా ఎన్నుకున్నాం - బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు-bjp decided with heavy heart that shinde would be cm says chandrakant patil ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  షిండేను బరువెక్కిన హృదయంతోనే సీఎంగా ఎన్నుకున్నాం - బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

షిండేను బరువెక్కిన హృదయంతోనే సీఎంగా ఎన్నుకున్నాం - బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 09:13 AM IST

maharashtra bjp chief chandrakant patil: మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఏక్‌నాథ్‌ షిండేను బరువెక్కిన హృదయంతో ఎన్నుకున్నామని అన్నారు.

<p>మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండ్ - దేవేంద్ర ఫడ్నవీస్(ఫైల్ ఫొటో)</p>
<p>మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండ్ - దేవేంద్ర ఫడ్నవీస్(ఫైల్ ఫొటో)</p> (twitter)

maharashtra bjp chief chandrakant patil comments: సీఎంగా షిండే ఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడ్నవీస్‌ కాకుండా రెబల్‌ అభ్యర్థి అయిన ఏక్‌నాథ్‌ షిండేను బరువెక్కిన హృదయంతో ఎంపిక చేశామని కామెంట్స్ చేశారు. శనివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా చంద్రకాంత్ పాటిల్ మాట్లాడారు. ప్రజలకు సరైన మేసేజ్ అందించే క్రమంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్థిరత్వం కోసం ఓ నాయకుడిని అందించాల్సిన అవసరం ఉందన్న ఆయన... కేంద్ర ప్రభుత్వంతో పాటు దేవేంద్ర ఫడణవీస్‌ బరువెక్కిన హృదయంతో ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

'సరైన మేసేజ్ అందించే క్రమంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ స్థిరత్వం కోసం ఓ నాయకుడిని అందించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు దేవేంద్ర ఫడణవీస్‌ బరువెక్కిన హృదయంతో ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు' - చంద్రకాంత్ పాటిల్, బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు

మహారాష్ట్ర సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సర్కారుపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గం...క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. ఇంతలోనే బీజేపీతో జట్టు కట్టి బలపరీక్షకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో మెజార్టీ కోల్పోయిన ఠాక్రే... సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అత్యధిక స్థానాలు ఉన్న బీజేపీ అభ్యర్థి ఫడ్నవీసే సీఎంగా ఎన్నికవుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించారు. ఇక ఫడ్నవీస్ కు డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు.

ఎన్నో పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాటిల్ చేసిన కామెంట్స్... చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని... పార్టీకి ఎలాంటి సంబంధించినవి కావని ఆ పార్టీకి చెందిన మరో నేత అశిష్ శీలర్ చెప్పారు. పార్టీలోని సాధారణ కార్యకర్తల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆయన అలా మాట్లాడి ఉండొచ్చని కామెంట్ చేశారు.