Bangladesh train set on fire : బంగ్లాదేశ్​లో అలజడి- రైలుకు ‘నిప్పు’.. ఎన్నికలకు రెండు రోజుల ముందు!-bangladesh passenger train set on fire days before general election ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bangladesh Train Set On Fire : బంగ్లాదేశ్​లో అలజడి- రైలుకు ‘నిప్పు’.. ఎన్నికలకు రెండు రోజుల ముందు!

Bangladesh train set on fire : బంగ్లాదేశ్​లో అలజడి- రైలుకు ‘నిప్పు’.. ఎన్నికలకు రెండు రోజుల ముందు!

Sharath Chitturi HT Telugu
Jan 06, 2024 08:29 AM IST

Bangladesh train set on fire : రైలుకు నిప్పింటించిన ఘటనతో బంగ్లాదేశ్​ ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 4 మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఎన్నికల వేళ ప్రజలను భయపెట్టేందుకే ఇలా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బంగ్లాదేశ్​లో అలజడి- రైలుకు ‘నిప్పు’..
బంగ్లాదేశ్​లో అలజడి- రైలుకు ‘నిప్పు’.. (AFP)

Bangladesh train set on fire : బంగ్లాదేశ్​లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో నలుగురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. కాగా.. జనవరి 7న జరగనున్న జాతీయ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఎవరో కావాలనే.. రైలుకు నిప్పు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదీ జరిగింది..

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకాలోని గోపీబాగ్​ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో.. బెనాపోల్​ ఎక్స్​ప్రెస్​లోని నాలుగు బోగీలకు నిప్పంటుకుంది. ఆ సమయంలో ఆ రైలు.. ఢాకా రైల్వే స్టేషన్​వైపు వెళుతోంది. ఆ నాలుగు బోగీలు అగ్నికి ఆహుతైపోయాయి.

Bangladesh election 2024 : 292 ప్రయాణికుల్లో చాలా మంది.. ఇండియా నుంచి సొంత ఇళ్లకు తిరిగి వెళుతున్న వారే ఉన్నారు. కాగా.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా రైలు దాడి జరిగినట్టు అనుమానాలు మొదలయ్యాయి.

ఎన్నికలకు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోందని ఓ సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. మంటలను ఆర్పేందుకు ఏడు అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి వెళ్లి శ్రమించాయి.

ఎన్నికల వేడీ మధ్య రైలుకు నిప్పు..!

బంగ్లాదేశ్​లోని రెండు ప్రధాన పార్టీలు (అధికార అవామీ లీగ్​, విపక్ష నేషనిల్ట్​ పార్టీ).. ఎలక్షన్​ కాండక్ట్​పై విభేదించుకుంటున్న తరుణంలో ఈ రైలు ప్రమాదం జరగడం వార్తలకెక్కింది.

Bangladesh latest news : మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తన పాలనలో.. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఎన్నికల నిర్వహణకు తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, అలాంటి చర్యకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంటూ తిరస్కరించారు.

టెలివిజన్ ప్రసంగంలో ప్రధాని హసీనా.. ప్రజలను బ్యాలెట్ కేంద్రాలకు వెళ్లాలని, తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.

Bangladesh train accident : “దారిలో నేను ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కోరుతున్నాను. నేను మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే, తప్పులను సరిదిద్దుకునే అవకాశం నాకు లభిస్తుంది. మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి,” అని కోరారు హసినా.

ఇక.. జనవరి 7న జరిగే సార్వత్రిక ఎన్నికలను పర్యవేక్షించేందుకు భారత్ నుంచి ముగ్గురు చొప్పున 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు బంగ్లాదేశ్ వెళ్లారు.

Whats_app_banner

సంబంధిత కథనం