Axis bank Q1 results : యాక్సిస్ బ్యాంక్ లాభాల జోరు.. 91శాతం వృద్ధి!
Axis bank q1 results 2022 : యాక్సిస్ బ్యాంక్ నికర లాభం.. 91శాతం వృద్ధి చెందింది. ఈ మేరకు ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో సంస్థ పేర్కొంది.
Axis bank q1 results 2022 : దేశంలోని అతిపెద్ద ప్రవేటు బ్యాంక్‌లలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. క్రితం ఏడాదితో పోల్చుకుంటే.. స్టాండెలోన్ ప్రాఫిట్లో 91శాతం వృద్ధిని నమోదు చేసింది యాక్సిస్ బ్యాంక్. రూ. 2,160కోట్ల నుంచి రూ. 4,125కోట్లకు చేరింది.
ఏడాది కాలంలో.. ఎన్ఐఐ(నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్) సైతం 21శాతం పెరిగింది. రూ. 7,760కోట్ల నుంచి రూ. 9,384కోట్లకు పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ ఆపరేటింగ్ ప్రాఫిట్.. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 34శాతం వృద్ధి చెంది రూ. 3,576కోట్లకు చేరింది. ఇదే సమయంలో రీటైల్ ఫీజు సైతం 43శాతం వృద్ధి చెందింది. బ్యాంక్ మొత్తం ఫీజు ఆదాయంలో దీని వాటా 66శాతం.
ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో గ్రాస్ ఎన్పీఏ రేషియో.. 2.76శాతంగా ఉంది. మార్చ్‌తో ముగిసిన త్రైమాసికంలో అది 2.82శాతంగా ఉండేది.
ఈ త్రైమాసికంలో.. రూ. 777కోట్ల అప్పులను ప్రావిజనింగ్ చేసినట్టు యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. మార్చ్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 602కోట్లను ప్రావిజనింగ్ చేసింది. ఇచ్చిన అప్పులు.. తిరిగి రావని స్పష్టమవుతుంటే.. బ్యాంక్‌లు ప్రావిజనింగ్ చేస్తూ ఉంటాయి.
యాక్సిస్ బ్యాంక్ సబ్సిడరీలు..
- యాక్సిస్ ఫైనాన్స్:- ఇయర్ ఆన్ ఇయర్‌తో పోల్చుకుంటే.. 2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం ప్యాట్ 59శాతం పెరిగింది. అసెట్ క్వాలిటీ స్థిరంగా ఉంది.
- యాక్సిస్ ఏఎంసీ:- ఇయర్ ఆన్ ఇయర్లో ప్యాట్ 20శాతం వృద్ధిచెందింది
- యాక్సిస్ క్యాపిటల్:- ఇయర్ ఆన్ ఇయర్లో ప్యాట్ రూ. 34కోట్లుగా నిలిచింది.
- యాక్సిస్ సెక్యూరిటీస్:- ఇయర్ ఆన్ ఇయర్లో ప్యాట్ రూ. 39కోట్లకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. స్టాక్ మార్కెట్లో యాక్సిస్ బ్యాంక్ షేరు ధర 0.5శాతం తగ్గి.. రూ. 727 వద్ద స్థిరపడింది.
సంబంధిత కథనం