Kotak Mahindra Bank Q1 results: భారీగా పెరిగిన నికర లాభం.. 26.1శాతం వృద్ధి -kotak mahindra bank q1 results net profit jumps 26 1 gross npa dips ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Kotak Mahindra Bank Q1 Results: Net Profit Jumps 26.1%, Gross Npa Dips

Kotak Mahindra Bank Q1 results: భారీగా పెరిగిన నికర లాభం.. 26.1శాతం వృద్ధి

Sharath Chitturi HT Telugu
Jul 23, 2022 01:44 PM IST

Kotak Mahindra Bank Q1 results: ఏప్రిల్​-జూన్​ త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది కొటాక్​ మహీంద్ర బ్యాంక్​. ఆ వివరాలు..

కొటాక్​ మహీంద్ర బ్యాంక్​
కొటాక్​ మహీంద్ర బ్యాంక్​ (Mint_Print)

Kotak Mahindra Bank Q1 results: 2022-23ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం ఫలితాలను కొటాక్​ మహీంద్ర బ్యాంక్ శనివారం విడుదల చేసింది. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఈసారి కొటాక్​ మహీంద్ర బ్యాంక్​ ప్రొవిజనింగ్​ పడిపోయింది. ఫలితంగా ఏడాది క్రితంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. ఏప్రిల్​- జూన్​ త్రైమాసికంలో రూ. 2,071.10కోట్ల నికర లాభాన్ని గడించింది కొటాక్​ మహీంద్ర బ్యాంక్​. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 1,641.90కోట్లుగా ఉంది. అంటే 26.10శాతం వృద్ధి చెందినట్టు.

ఈ త్రైమాసికంలో కొటాక్​ మహీంద్ర బ్యాంక్​ నెట్​ ఇంట్రెస్ట్​ ఇన్​కమ్​ 19.20శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎన్​ఐఐ రూ. 3,941.70కోట్లుగా ఉండగా.. ఇప్పుడది రూ. 4,697కోట్లకు చేరింది. కొటాక్​ మహీంద్ర బ్యాంక్​ పూర్తి ఆదాయ.. రూ. 11,658.94గా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దాని విలువ రూ. 12,571.61గా నమోదైంది.

Kotak Mahindra Bank : మొండి బకాయిల విషయంలోనూ కొటాక్​ మహీంద్ర బ్యాంక్​ పరిస్థితి మెరుగుపడింది. గ్రాస్​ ఎన్​పీఏ రూ. 6,379కోట్లుగా ఉంది. గత త్రైమాసికంలో దాని విలువ రూ. 6,470కోట్లుగా నమోదైంది. కాగా.. నెట్​ ఎన్​పీఏ మాత్రం 0.70శాతం పెరిగి రూ. 1,749కోట్లకు చేరింది.

కొటాక్​ మహీంద్ర బ్యాంక్​ ఖర్చులు రూ. 4,960.01కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 6,342.83కోట్లుగా ఉండేది.

IPL_Entry_Point

సంబంధిత కథనం