Atiq Ahmad : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​ చివరి క్షణాలు- అసలేం జరిగింది? లైవ్​ వీడియో..-atiq ahmed shot dead live video shooters who killed him were posing as journalists ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Atiq Ahmad : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​ చివరి క్షణాలు- అసలేం జరిగింది? లైవ్​ వీడియో..

Atiq Ahmad : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​ చివరి క్షణాలు- అసలేం జరిగింది? లైవ్​ వీడియో..

Sharath Chitturi HT Telugu
Apr 16, 2023 07:20 AM IST

Atiq Ahmad dead : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​ హత్యకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. కొందరు దుండగులు జర్నలిస్టుల వేషంలో వచ్చి కాల్పులు జరిపారు.

అతీక్​ అహ్మద్​ చివరి క్షణాలు..
అతీక్​ అహ్మద్​ చివరి క్షణాలు.. ((HT Photo))

Atiq Ahmad dead : గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​ దారుణ హత్యతో దేశం ఉలిక్కిపడింది. ఉత్తర్​ ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో అహ్మద్​తో పాటు అతడి సోదరుడు అష్రాఫ్​ను కొందరు దుండగులు పాయింట్​ బ్లాంక్​ రేంజ్​లో కాల్చి చంపేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉత్తర్​ ప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 144 సెక్షన్​ విధించింది. మరోవైపు అతీక్​ అహ్మద్​ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అసలేం జరిగింది? అతీక్​, అతడి సోదరుడిని దుండగులు ఎలా చంపారు?

చివరి మాటలు.. చివరి క్షణాలు.. లైవ్​ వీడియో..

విచారణ కోసం అతీక్​ అహ్మద్​, అతడి సోదరుడు అష్రాఫ్​ను పోలీసులు శనివారం ప్రయాగ్​రాజ్​కు తీసుకొచ్చారు. రాత్రి వారిద్దరిని వైద్యపరీక్షల కోసం బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో వారి చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. హై- సెక్యూరిటీ మధ్య వారు ఆసుపత్రికి చేరుకున్న అనంతరం.. కొందరు జర్నలిస్టులు అక్కడ గుమిగూడారు. అతీక్​ అహ్మద్​ను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

Atiq Ahmad shot dead viral video : అతీక్​ అహ్మద్​ కుమారుడు ఇటీవలే పోలీసుల ఎన్​కౌంటర్​లో మరణించాడు. అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అహ్మద్​కు అనుమతులివ్వలేదు. ఈ విషయంపై స్పందించాలని అతీక్​ అహ్మద్​ను జర్నలిస్టులు కోరారు.

"పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లలేదు. మేము వెళ్లలేదు," అని జవాబు ఇచ్చాడు అతీక్​ అహ్మద్​. అవే తన చివరి మాటలు అవుతాయని అతను అనుకుని ఉండడు!

Atiq Ahmed death news : కొద్ది క్షణాల్లోనే జర్నలిస్టు మధ్యలో నుంచి తుపాకీ పట్టుకున్న ఓ చెయ్యి అతీక్​ అహ్మద్​వైపు దూసుకొచ్చింది. అతీక్​ అహ్మద్​, అతని సోదరుడిపై పాయింట్​ బ్లాంక్​ రేంజ్​లో కాల్పులు జరిగాయి. వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు.

"జర్నలిస్టుల మధ్యలో ఆ ముగ్గురు ఉన్నారు. ఒకరు మైక్​ పట్టుకుని ఉండగా.. మరొకరు కెమెరా పట్టుకుని కనిపించాడు. మరో వ్యక్తి వీరిద్దరికి సాయం చేస్తున్నట్టు నటించాడు. అతను వెంటనే మైక్​ పడేసి.. తుపాకీ తీసి అతీక్​ అహ్మద్​ను కాల్చిచంపేశాడు. ఆ తర్వాత అతని సోదరుడిపై దాడి చేశాడు. ఇంతలో మరో ఇద్దరు కూడా, తుపాకీలతో దాడి చేశారు. పోలీసులు స్పందించే లోపే ఇదంతా జరిగిపోయింది," అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Atiq Ahmad murdered : అతీక్​ అహ్మద్​ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు మీడియా కెమెరాలకు చిక్కాయి. అవి ప్రస్తుతం వైరల్​గా మారాయి.

మరోవైపు ఘటనకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వివరాలను పోలీసులు ఇంకా బయటపెట్టలేదు. కాగా.. అతీక్​ అహ్మద్​ను చంపిన అనంతరం ఈ ముగ్గురు 'జై శ్రీరామ్​' అని నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం