Budget Session 2022 | ఓం బిర్లాకు విపక్షాల హామీ!-an all party meeting was called by lok sabha speaker om birla ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Budget Session 2022 | ఓం బిర్లాకు విపక్షాల హామీ!

Budget Session 2022 | ఓం బిర్లాకు విపక్షాల హామీ!

HT Telugu Desk HT Telugu
Jan 31, 2022 03:14 PM IST

Budget 2022 | లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని, విపక్షాలు హామీనిచ్చినట్టు ఓం బిర్లా వెల్లడించారు.

<p>ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ</p>
ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ (HT_PRINT)

Union Budget news  దేశ రాజధాని ఢిల్లీలో.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఓం బిర్లా. "సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలను కోరాను. ఈ బడ్జెట్​ సమావేశాలు దేశానికి ఎంతో ముఖ్యమని వివరించాను. వారు అందుకు అంగీకరించి, సభల కార్యకలాపాలకు సహకరిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్​పై చర్చలు జరపాలని అభ్యర్థించాను. జాతీయస్థాయి సమస్యలను లేవనెత్తి, వాటిని పరిష్కరించుకునేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడాలని చెప్పాను," అని ఓం బిర్లా పేర్కొన్నారు.

ప్రహ్లాద్​ జోషి, అధిర్​ రంజన్​ చౌదరి, ఫరూక్​ అబ్దుల్లా, సుప్రియా సులే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

బడ్జెట్​ సమావేశాలు షురూ..

Union Budget 2022 Date | రెండు దశల్లో జరగనున్న 2022 బడ్జెట్​ సమావేశాలు.. సోమవారం ప్రారంభమయ్యాయి. కొవిడ్​ నిబంధనలకు అనుగూణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. మంగళవారం బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​ ప్రసంగంతో బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మోదీ ప్రభుత్వం కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిందని, ఇప్పటివరకు 150 కోట్ల డోసులు అందజేయగలిగిందని, రికార్డు సమయంలో పూర్తి చేసిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ దేశంలో 6 కోట్ల కుటుంబాలు ఇంటింటికి నల్లా నీరు పొందుతున్నారని, హర్ ఘర్ జల్ పథకం విజయవంతమవుతోందని తెలిపారు.

‘సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు ఉన్న 'అంత్యోదయ' ప్రాథమిక మంత్రాన్ని ఈ ప్రభుత్వం విశ్వసిస్తోంది. పీఎం ఆవాస్ యోజన, పీఎం స్వానిధి, హర్ ఘర్ జల్, పీఎం స్వామిత్వ వంటి పథకాలు దేశవ్యాప్తంగా పౌరులకు గొప్పగా ఉపయోగపడుతున్నాయి..’ అని రాష్ట్రపతి వివరించారు.

Economic Survey 2022 | అనంతరం లోక్​సభలో నిర్మలా సీతారామన్​ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. ఇది గతేడాది 3.6 శాతంగా ఉంది.

మోదీ పిలుపు..

Prime Minister Narendra Modi | సమావేశాల ప్రారంభానికి ముందు.. పార్లమెంట్​ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశం ప్రగతిపథాన పయనించేలా చర్చలు ఫలప్రదమవ్వాలని, పార్లమెంటు సభ్యులు అన్ని అంశాలపై ఓపెన్ మైండ్‌తో చర్చించాలని కోరారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అవి సెషన్‌పై ప్రభావం చూపకుండా, ఎంపీలంతా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం చర్చల ద్వారా బ్లూ ప్రింట్ సిద్ధం చేయడంలో తోడ్పడాలని పిలుపునిచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం