Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలు.. బీజేపీ- జేడీయూ కలిస్తే..-amid nitish kumar rumours a look at strength of bjp rjd jdu in bihar assembly ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలు.. బీజేపీ- జేడీయూ కలిస్తే..

Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలు.. బీజేపీ- జేడీయూ కలిస్తే..

HT Telugu Desk HT Telugu
Jan 26, 2024 08:46 PM IST

Nitish Kumar politics: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ మరోసారి యూటర్న్ తీసుకుని బీజేపీతో చేతులు కలపబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బిహార్ అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)
బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)

Bihar politics: నితీశ్ కుమార్ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతారనే ఊహాగానాలతో బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో బీహార్ అసెంబ్లీలోని సంఖ్యాబలంపై మరోసారి దృష్టి మళ్లింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య గురువారం ఎక్స్ పోస్ట్ లో 'పవనాలు దిశను మారుస్తున్న కొద్దీ భావజాలం మారుతోంది' అని మాట్లాడిన తర్వాత నితీశ్ తిరిగి ఎన్డీయేలో చేరుతారనే పుకార్లు మరింత వేగంగా చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. జేడీయూ, ఆర్జేడీలు వేర్వేరుగా సమావేశమై పార్టీ అగ్రనాయకత్వంతో ఈ పరిణామాలపై చర్చించడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి.

బిహార్ అసెంబ్లీలో సంఖ్యాబలాలు

బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులున్నారు. వీరిలో అత్యధికంగా ఎమ్మెల్యేలు ఆర్జేడీకి ఉన్నారు. బీహార్ లోని వివిధ పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా వివరాలు..

ఆర్జేడీ - 79

బీజేపీ - 78

జేడీయూ - 45

కాంగ్రెస్ - 19

లెఫ్ట్ - 16

హెచ్ ఏఎం - 4

ఎంఐఎం - 1

ఇండిపెండెంట్ - 1

మహాకూటమిలో..

ప్రస్తుతం బీహార్ లో 'మహాకూటమి' ప్రభుత్వంలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, మూడు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. అయితే జేడీయూ కూటమి నుంచి వైదొలగితే ఆ పార్టీకి 114 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుంది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.

బీజేపీ, జేడీయూ కలిస్తే..

ఇప్పుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ మళ్లీ బీజేపీతో చేతులు కలిపితే ఆ రెండు పార్టీలు, ప్లస్ ఆ కూటమికి మద్దతిచ్చే పార్టీలతో కలిపి మొత్తం 125 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. నితీశ్ కుమార్ కు యూ టర్న్ నాయకుడిగా పేరుంది. ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకునేందుకు ఆయన సిద్ధాంతాలకు అతీతంగా పార్టీల నుంచి మద్దతు స్వీకరిస్తుంటారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. సంకీర్ణంలో చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం కారణంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 2022లో నితీశ్ బీజేపీని వీడి, కాంగ్రెస్, ఆర్జేడీ తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Whats_app_banner