Twitter | 'మస్క్' ఎఫెక్ట్.. ఉద్యోగాల కోత షురూ.. నియామకాలు బంద్!
Elon Musk twitter news | ఇద్దరు సీనియర్ ఉద్యోగులను ట్విట్టర్ ఫైర్ చేసింది! అదే సమయంలో నియామకాలను నిలిపివేసింది. మస్క్ ట్విట్టర్ డీల్‌తో సంస్థ ఉద్యోగులు భయపడిపోతున్న వేళ ఈ వార్త.. వారందరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
Elon Musk twitter news | ట్విట్టర్ ఉద్యోగులు భయపడుతున్నదే జరిగింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ నేపథ్యంలో.. సంస్థ ఉద్యోగాలలో కోత మొదలైంది! ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టు ట్విట్టర్ తాజాగా వెల్లడించింది. కాగా.. వారిపై సంస్థ వేటు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నియామకాలను సైతం ట్విట్టర్ నిలిపివేసింది.
ట్విట్టర్ రీసెర్చ్, డిజైన్ మేనేజర్ కేవోన్ బేక్పూర్తో పాటు ప్రాడక్ట్ హెడ్ బ్రూస్ ఫాల్క్.. సంస్థని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. కాగా.. ఇది తన ఇష్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పని అని కేన్ వెల్లడించారు.
"నిజం ఏంటంటే.. ట్విట్టర్‌తో నా బంధం ఇలా ముగించాలని నేను అనుకోలేదు. సీఈఓ పరాగ్ అగర్వాల్ నాతో మాట్లాడారు. నేను సంస్థలను వదిలేయాలని చెప్పారు," అని కేన్ అన్నారు.
అదే సమయంలో.. బిజినెస్‌లో కీలకమైన పదవులకు తప్పించి, ఈ వారం నుంచి నియామకాలను నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ వెల్లడించింది.
ఉద్యోగుల్లో ఆందోళన..
ట్విట్టర్- మస్క్ మధ్య ఇటీవలే 44బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఆ డీల్‌ను పూర్తిచేసే పనిలో పడ్డారు మస్క్. ట్విట్టర్ తన చేతికి వస్తే.. అందులో అనేక మార్పులు చేసేందుకు మస్క్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
డీల్ కుదిరినప్పటి నుంచి.. ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. తమ ఉద్యోగాలు ఉంటాయా? లేక ఊడిపోతాయా? అని వారందరు భయపడుతున్నారు. ఇదే విషయంపై పరాగ్ అగర్వాల్‌ను అనేకమార్లు నిలదీశారు. వారందరికీ ఆయన సానుకూలంగానే జవాబులిచ్చారు.
కాగా.. కొత్త సీఈఓను తీసుకొచ్చేందుకు మస్క్ ప్రణాళికలు రచిస్తున్నారన్న వార్తలతో.. ట్విట్టర్లో పరాగ్ అగర్వాల్ స్థానమే ప్రశ్నార్థకంగా మారింది!
సంబంధిత కథనం