'ఏదో ఉద్దరిస్తారని బైడెన్​ను ఎన్నుకోలేదు.. ట్రంప్​ డ్రామాను తట్టుకోలేకే..'-biden won over trump as people wanted less drama says musk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Biden Won Over Trump As People Wanted 'Less Drama' Says Musk

'ఏదో ఉద్దరిస్తారని బైడెన్​ను ఎన్నుకోలేదు.. ట్రంప్​ డ్రామాను తట్టుకోలేకే..'

HT Telugu Desk HT Telugu
May 13, 2022 07:31 AM IST

Elon Musk | టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. అమెరికా ఆధ్యక్షుడు బైడెన్​పై విమర్శలు చేశారు. దేశాన్ని ఉద్దరిస్తారని భావించి.. ప్రజలు ఆయన్ని ఎన్నుకోలేదని అన్నారు.

ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​ (REUTERS/file)

Elon Musk | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​పై టెస్లా సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేస్తారని.. ప్రజలు బైడెన్​ను ఎన్నుకోలేదన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ డ్రామాను తట్టుకోలేకే.. బైడెన్​ను గెలిపించారని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

"ప్రజలను విభజించాలని ట్రంప్​ అనుకుంటూ ఉంటారు. అలాంటి భావాలు ఆయనలో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆలోచనలు తక్కువగా ఉన్న అభ్యర్థిని 2024 ఎన్నికల్లో నేను చూడాలి అని అనుకుంటున్నా. ఇక ట్రంప్​ డ్రామ్​ను ప్రజలు తట్టుకోలేకపోయారు. అందుకే.. తక్కువ డ్రామా కోసం బైడెన్​ను ఎన్నుకున్నారు. దేశాభివృద్ధి కోసమే తనని ప్రజలు ఎన్నుకున్నారని బైడెన్​ భావిస్తే.. అది పొరపాటే అవుతుంది," అని మస్క్​ అన్నారు.

'నిషేధం ఎత్తేస్తా..'

Trump twitter ban | 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది జనవరిలో చెలరేగిన హింసకు ట్రంప్​ కారణని భావిస్తూ.. ఆయన్ని సామాజిక మాధ్యమాలు నిషేధించాయి. ఆయన ఖాతాను ట్విట్టర్​ తొలగించింది. తాజాగా.. ఈ విషయాన్ని మస్క్​ తప్పుబట్టారు. ట్విట్టర్​తో డీల్​ పూర్తైన వెంటనే.. ట్రంప్​ ట్విట్టర్​ ఖాతాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని స్పష్టం చేశారు.

ట్విట్టర్​- మస్క్​ డీల్​..

Elon Musk twitter deal | ట్విట్టర్​- మస్క్​ మధ్య ఇటీవలే 44బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఆ డీల్​ను పూర్తిచేసే పనిలో పడ్డారు మస్క్​. ట్విట్టర్​ తన చేతికి వస్తే.. అందులో అనేక మార్పులు చేసేందుకు మస్క్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్