World's deadliest earthquakes : ప్రపంచాన్ని కుదిపేసిన అతి భయానక భూకంపాలు ఇవే!
World's deadliest earthquakes : టర్కీ భూకంపంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అక్కడి దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరం నుంచి ప్రపంచాన్ని కుదిపేసిన పలు భూకంపాల ఘటనల గురించి తెలుసుకుందాము.
World's deadliest earthquakes : టర్కీలో భయానక భూకంపంతో ప్రపంచం ఉలిక్కిపడింది. వరుస భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 4వేలు దాటింది! అక్కడి ప్రజల బాధను చూసి ప్రపంచ దేశాలు కన్నీరు పెట్టుకుంటున్నాయి. అయితే.. అత్యంత భయంకరమైన భూకంపాల ఘటనలకు ప్రపంచం ఇప్పటికే సాక్ష్యంగా నిలిచింది. తాజా పరిణామాల నేపథ్యంలో.. 2000 నుంచి ప్రపంచం చూసిన అత్యంత దారుణమైన, భయానకమైన భూకంపాల ఘటనలను తెలుసుకుందాము..
అత్యంత భయానక ఘటనలు.. వేలల్లో మృతులు..!
2022 జూన్ 22:- అఫ్గానిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 1,100 మందికిపైగా ప్రజలు మరణించారు.
2021 ఆగస్ట్ 14:- 7.2 తీవ్రతతో హైతీలో భూమి కంపించింది. 2,200మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Turkey earthquake today : 2018 సెప్టెంబర్ 28:- 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఇండోనేషియాలో మృతుల సంఖ్య 4,300 దాటింది.
2016 ఆగస్ట్ 24:- 6.2 తీవ్రతతో మధ్య ఇటలీలో భూకంపం సంభవించింది. 300మంది బలయ్యారు.
2015 ఏప్రిల్ 25:- నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూమి కంపించడంతో 8,800మందికి పైగా ప్రజలు మరణించారు.
Turkey earthquake death toll : 2014 ఆగస్ట్ 3:- చైనాలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. 700మంది ప్రాణలు కోల్పోయారు.
2013 సెప్టెంబర్ 24:- పాకిస్థాన్‌లో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. 800మందికి పైగా ప్రజలు మృతిచెందారు.
2011 మార్చ్ 11:- 9.0 తీవ్రతో జపాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి సునామీ సైతం వచ్చింది. ఈ ఘటనలో 20వేల మంది మరణించారు.
2010 ఫిబ్రవరి 27:- చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 524మంది బలయ్యారు.
2010 జనవరి 12:- హైతీలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. 3,16,000మంది మరణించారు!
Earthquake in Turkey latest news : 2009 సెప్టెంబర్ 30:- 7.5 తీవ్రతతో దక్షిణ సుమాత్ర, ఇండోనేషియాలో వచ్చిన భూకంపం ధాటికి 1,100మందికిపైగా ప్రజలు మృతిచెందారు.
2009 ఏప్రిల్ 6:- ఇటలీలో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. 300మంది మరణించారు.
2008 మే 12:- చైనాను 7.9 తీవ్రతతో భూకంపం గడగడలాడించింది. 87,500 మంది బలయ్యారు.
2007 ఆగస్ట్ 15:- మధ్య పెరూలో 8.0 తీవ్రతతో భూమి కంపించింది. 500మంది మరణించారు.
2006 మే 26:- జావా, ఇండోనేషియాలో సంభవించిన భూకంపంలో 5,700 మంది బలయ్యారు. రిక్టార్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది.
Turkey Earthquake latest updates : 2005 అక్టోబర్ 8:- పాకిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. 7.6 తీవ్రత నమోదైంది. 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
2005 మార్చ్ 28:- ఇండోనేషియా ఈశాన్య సుమాత్రాలో 8.6 తీవ్రతతో భూమి కంపించింది. 1300మంది మరణించారు.
2004 డిసెంబర్ 26:- ఇండోనేషియాలో 9.1 తీవ్రతతో భూమి కంపించింది. ఫలితంగా హిందూ మహా సముద్రంలో భారీ సునామీ ఏర్పడింది. వివిధ దేశాల్లో 2,30,000 మంది మృతిచెందారు.
2003 డిసెంబర్ 26:- నైరుతు ఇరాన్లో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. 50వేల మంది మరణించారు.
Turkey earthquake reason : 2003 మే 21:- అల్గేరియాలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2,200మంది ప్రాణాలు కోల్పోయారు.
2002 మార్చ్ 25:- అఫ్గానిస్థాన్‌లో 6.1 తీవ్రతతో నమోదైన భూకంపం ధాటికి 1000మంది బలయ్యారు.
2001 జనవరి 26:- ఇండియా గుజరాత్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 20వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
* పైన చెప్పిన భూకంపాల ఘటనలు, మృతుల సంఖ్యను యూఎస్ జియోలాజికల్ సర్వే డేటా నుంచి తీసుకోవడం జరిగింది.