Earthquake in Uttarkashi : ఉత్తరకాశీలో భూకంపం.. నేపాల్​లో భూ ప్రకంపనలు-moderate intensity earthquake hits nepal an uttarkashi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Moderate Intensity Earthquake Hits Nepal An Uttarkashi

Earthquake in Uttarkashi : ఉత్తరకాశీలో భూకంపం.. నేపాల్​లో భూ ప్రకంపనలు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 19, 2022 08:16 AM IST

Uttarkashi Earthquake today : నేపాల్​లో ఆదివారం రాత్రి, ఉత్తరకాశీలో సోమవారం తెల్లవారుజామున భూకంపాలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

నేపాల్​లో భూకంపం
నేపాల్​లో భూకంపం

Earthquake in Nepal : నేపాల్​లో మరోమారు భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. ఈ విషయాన్ని ఎర్త్​క్వేక్​ మానిటరింగ్​ అండ్​ రీసెర్చ్​ సెంటర్​ ఆఫ్​ నేపాల్​ వెల్లడించింది.

ఖాట్మాండుకు పశ్చిమాన, 50కి.మీల దూరంలోని ధండింగ్​ జిల్లా కేంద్రంగా ఆదివారం రాత్రి 10:53 గంటలకు భూకంపం సంభవించింది. ఖాట్మాండూతో పాటు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే.. భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.

నేపాల్​ కేంద్రంగా తరచూ భూకంపాలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు.

ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు..

Uttarkashi Earthquake today : సోమవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైంది.

నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ ప్రకటన ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 1:50 గంటలకు.. ఉత్తరకాశీకి 24 కి.మీల దూరంలో భూమికి 5కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

"3.1 తీవ్రతతో ఉత్తరకాశీలో 19-12-2022 1:50ఏఎంకు భూకంపం సంభవించింది. భూమికి 5కి.మీల దిగువన భూకంపం వచ్చింది," అని నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ ట్వీట్​ చేసింది.

Earthquake in Uttarkashi today : ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదు.

ఉత్తరాఖండ్​లో తరచూ భూప్రకంపనలు వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్​ 6న.. ఉత్తరాఖండ్​లోని టెహ్రీ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టార్​ స్కేలుపై 4.5గా నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా..

Earthquak in Texas latest updates : ప్రపంచవ్యాప్తంగా భూకంపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. అమెరికా టెక్సాస్​లో కొన్ని రోజుల క్రితమే భూకంపం సంభవించింది. టెక్సాస్​ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. చమురు ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉండే పశ్చిమ టెక్సాస్​ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5:35 గంటలకు.. భూకంపం సంభవించింది. మిడ్​ల్యాండ్​ ప్రాంతానికి ఉత్తర-వాయువ్యం వైపు 14 మైళ్ల దూరంలో భూమికి 8కి.మీల దిగువన భూ ప్రకంపనలను గుర్తించినట్టు యూఎస్​ జీయోలాజికల్​ సర్వే ప్రకటన విడుదల చేసింది. రిక్టార్​ స్కేల్​పై దాని తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్​ చరిత్రలో ఇది 4వ అతిపెద్ద భూకంపం అని నేషనల్​ వెథర్​ సర్వీసెస్​ పేర్కొంది.

ఈ భూకంపం తర్వాత.. మూడు నిమిషాలకు.. 3.3 తీవ్రతతో మళ్లీ భూ ప్రకంపనలు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం