Shiv Sena news : 'శివసేన ఎన్నికల గుర్తు, పేరును కొనేందుకు రూ. 2వేల కోట్ల డీల్'
Shiv Sena news : శివసేన ఎన్నికల గుర్తు, పేరు అంశంలో న్యాయం జరగలేదని, అంతా వ్యాపారమే నడిచిందని ఆరోపించారు ఎంపీ సంజయ్ రౌత్. పార్టీ గుర్తును, పేరును ఏక్నాథ్ శిందే వర్గానికి ఇచ్చేందుకు రూ. 2వేల కోట్ల డీల్ జరిగిందని అన్నారు.
Sanjay Raut Shiv Sena news : శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే వర్గానికి అప్పజెబుతూ ఈసీ చేసిన ప్రకటన నేపథ్యంలో తీవ్రస్థాయిలో ఆరోపించారు ఎంపీ సంజయ్ రౌత్. పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కొనుగోలు చేసేందుకు రూ. 2వేల కోట్ల లావాదేవీలు జరిగాయాని పేర్కొన్నారు. ఇది 100శాతం నిజం అని తెలిపిన ఆయన.. తన దగ్గర ఆధారాలున్నట్టు వెల్లడించారు. అధికార పక్షంతో సంబంధం ఉన్న ఓ బిల్డర్.. తనకు ఈ విషయాన్ని చెప్పినట్టు స్పష్టం చేశారు. త్వరలోనే ఆధారాలను బయటపెడతానన్నారు. ఈ మేరకు ట్వీటర్లో ఈ విషయాలను వెల్లడించారు సంజయ్ రౌత్.
'న్యాయం లేదు.. అంతా వ్యాపారమే!'
గతేడాది శివసేన పార్టీలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే వర్గం- ఏక్నాథ్ శిందే వర్గాలుగా పార్టీ వీడిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు ఉద్ధవ్ ఠాక్రే. ఆ వెంటనే.. బీజేపీ మద్దతుతో అధికారాన్ని, సీఎం బాధ్యతలు స్వీకరించారు ఏక్నాథ్ శిందే. కాగా.. అప్పటి నుంచి పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఎవరికి దక్కుతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగింది. చివరికి.. అవి ఏక్నాథ్ శిందే వర్గానికే అప్పజెబుతూ ప్రకటన చేసింది ఎన్నికల సంఘం.
Sanjay Raut latest news : ఈ నేపథ్యంలో ఈసీపై సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శిందే వర్గాన్ని నిజమైన శివ సేనగా గుర్తించడం వెనుక.. న్యాయం లేదని, అంతా వ్యాపారమే జరిగిందని ఆరోపించారు. "ఈ విషయంలో ఇప్పటివరకు రూ. 2వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇది నా ప్రాథమిక అంచనా మాత్రమే. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కొనేశారు. ఇది నేను రూపొందించిన ఎఫ్ఐఆర్," అని వ్యాఖ్యానించారు సంజయ్ రౌత్.
"ప్రభుత్వం, నాయకుడు, చిత్తశుద్ధి లేని మనుషులతో కూడిన బృందాలు కలిసి.. ఎమ్మెల్యేలకు రూ. 50కోట్లకు, ఎంపీలను రూ. 100కోట్లకు కొనేస్తున్నారు. కౌన్సిలర్ల కోసం రూ. 1కోటి ఇస్తున్నారు. అలాంటి ఒక పార్టీని, పార్టీ పేరును, పార్టీ గుర్తును కొనేందుకు ఇంకెంత ఖర్చు చేస్తారో మీరే ఊహించుకోవచ్చు. నాకు అందిన సమాచారం ప్రకారం అది రూ. 2వేల కోట్లు," అని ఉద్ధవ్ ఠాక్రేకు నమ్మకస్తుడైన సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
'సంజయ్ రౌత్ ఆరోపణలు అవాస్తవం..'
Sanjay Raut Shiv Sena : సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలను ఏక్నాథ్ శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఖండించారు. "ఆయన క్యాషియర్ ఆ ఏంటి? అలా మాట్లాడుతున్నారు," అని ఎమ్మెల్యే సదా సార్వంకర్ విమర్శించారు.