షారుఖ్ ఖాన్(Shahrukh Khan), దీపికా పదుకోణె(deepika padukone) జంటగా నటించిన పఠాన్ సినిమా(Pathaan Cinema)పై సర్వత్రా చర్చ జరుగుతోంది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమాకి సంబంధించి అనేక వివాదాలు తలెత్తాయి. పఠాన్ సినిమాలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణె కాషాయం ధరించడంపై కొన్ని హిందుత్వ అనుకూల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే దీనిని శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) ఖండించారు. షారుఖ్ ఖాన్ సినిమా కాబట్టి వ్యతిరేకించడం తప్పు అని అన్నారు.
'పఠాన్(Pathaan) సినిమాపై ఇలాంటి వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఉర్ఫీ జావేద్ ధరించిన దుస్తులపై కూడా బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి. మీరు వాటి నుంచి ప్రశ్నలను తప్పించుకోడానికి ఇలా చేస్తున్నారు. అటువంటి విషయం గురించి చర్చించండి.' అని సంజయ్ రౌత్ అన్నారు.
బీజేపీతో సంబంధమున్న కళాకారులు కూడా కాషాయ బట్టలు ధరిస్తున్నారని తెలిపారు. సెన్సార్ బోర్డు(Censor Board) ప్రభుత్వ కీలుబొమ్మ అని సంజయ్ విమర్శించారు. ఇది షారుక్ ఖాన్ సినిమా(Shahrukh Khan Cinema) కావడంతో సీన్ కట్ చేశారని, నగ్నత్వం చూపిస్తే ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినా సరే.. కానీ కాషాయ బట్టల కారణంగా ఆ సన్నివేశాన్ని తొలగించడం తప్పు అని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు.
సిద్ధార్థ్ ఆనంద్ 'పఠాన్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా చాలా దేశాల్లో చిత్రీకరించారు. సిక్స్ ప్యాక్ కోసం షారుఖ్ చాలా కష్టపడ్డాడు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు. పఠాన్ ట్రైలర్(Pathaan Trailer), పాటల వల్ల సినిమాపై హైప్ పెరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా 'పఠాన్' విడుదలవుతున్నందున ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని భావిస్తోంది చిత్రబృందం. దీపికా పదుకొణె, షారుక్ ఖాన్ జంటగా నటిస్తున్న నాలుగో సినిమా ఇది. దాంతో పఠాన్ మీద హైప్ క్రియేట్ అయింది.
షారుఖ్ ఖాన్(Sharukh Khan) పఠాన్(Pathaan)తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రేక్షకులను కట్టిపడేసేందుకు.. ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు చిత్రం బృందం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా(Burj Khalifa)లో పఠాన్ ట్రైలర్‌ను ప్లే చేశారు. ప్రమోషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ ప్లే చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జనవరి 25, 2023న పఠాన్ సినిమా విడుదల కానుంది. హిందీ, తమిళం, తెలుగులో విడుదలవుతోంది.