Heavy rains in North India : భారీ వర్షాలకు ఉత్తర భారతం విలవిల.. 13మంది మృతి!
Heavy rains in North India today : ఉత్తర భారతంలో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 13మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
Heavy rains in North India : భారీ వర్షాల కారణంగా ఉత్తర భారతం విలవిలలాడిపోతోంది. ముఖ్యాంగా ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వరుసగా రెండు రోజులు అక్కడ భారీ వర్షాలు పడ్డాయి. వేరు వేరు ఘటనల్లో ఇప్పటివరకు 13మంది మరణించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి..
ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఉత్తర భారతంలో నమోదైన 13 మరణాల్లో 12.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవే. అనేక జిల్లాలు నీటమునిగాయి. 16 జిల్లాల్లోని 650 గ్రామాలపై వరద ప్రభావం పడింది. 5,80,000మందికిపైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Uttar Pradesh rain news today : భారీ వర్షాల నేపథ్యంలోనే లక్నో, ఆలీగఢ్, మీరట్, గౌతం బుద్ధ్ నగర్, గజియాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో స్కూళ్లకు, విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.
మరోవైపు ఆగ్రాలో కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉండటంతో, రోడ్డు మీదే నీరు నిలిచిపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వినూత్నంగా నిరసనకు దిగారు. 'నరక్పురి', 'కీచడ్ నగర్' అంటూ విచిత్రమైన పేర్లు పెట్టి ఆందోళనకు దిగారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉత్తరాఖండ్‌లో..
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా అల్మోరా జిల్లాలోని కొండచరియలు విరిగిపడ్డాయి. అవి పక్కనే ఉన్న ఇంటి మీద పడ్డాయి. ఈ ఘటనలో ఓ 55ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. అనేక నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కుమౌన్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Uttarakhand rains : ఐఎండీ అధికారుల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో శనివారం నుంచి ఆదివారం వరకు 24 గంటల వ్యవధిలో 30.4ఎంఎంల వర్షపాతం నమోదైంది. సగటు కన్నా ఇది 1798శాతం ఎక్కువ! నైనిటాల్లో రికార్డు స్థాయిలో 81.5ఎంఎం వర్షపాతం నమోదైంది.
హిమాచల్ ప్రదేశ్‌లో సైతం 12 జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. అదృష్టవశాత్తు ఇక్కడ ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.
యెల్లో అలర్ట్..
Uttar Pradesh floods : మరోవైపు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో మంచు కురువడం మొదలైంది. భారీ వర్షాలు, మంచు కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి.
ఇక ఉత్తర- పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో అక్టోబర్ 14 వరకు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
సంబంధిత కథనం