UP rape case : మైనర్పై సామూహిక అత్యాచారం- ఆరుగురు కిడ్నాప్ చేసి..
UP rape case : ఉత్తర్ప్రదేశ్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ మైనర్పై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఘటనలో.. ఓ బాలికను 15ఏళ్ల బాలుడు రేప్ చేశాడు.
Minor raped in Uttar Pradesh : ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 12ఏళ్ల బాలిక.. సామూహిక అత్యాచారానికి గురైంది.
ఉత్తర్ప్రదేశ్ మైన్పూరిలో శుక్రవారం జరిగింది ఈ ఘటన. బాలిక.. తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో.. ఆరుగురు వ్యక్తులు.. ఆ ఇంట్లోకి చొరబడ్డారు. బాలికను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి సమీపంలోని పోలానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నిందితులు అందరు 25-27ఏళ్ల మధ్య వయస్కులని తెలుస్తోంది.
ఘటనపై బాలిక తండ్రి.. పోలీసులకు సమాచారం అందించాడు. పోక్సో చట్టంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టారు.
మరో ఘటన..
UP rape case : ఉత్తర్ప్రదేశ్లో నేరాలు ఆందోళనకర రీతిలో ఉన్నాయి. ఓ మైనర్ బాలికపై 15ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. బరేలీలో శనివారం జరిగింది ఈ ఘటన.
బాలికకు చాక్లెట్లు ఆశ చూపి.. ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడే ఆమెను రేప్ చేశాడు. ఈ క్రమంలో బాలిక గట్టిగా అరవడం మొదలుపెట్టింది.
బాలిక అరుపులు విన్న స్థానికులు.. శబ్దాలు వస్తున్న ప్రాంతానికి పరుగులు తీశారు. అప్పుడే నిందితుడిని పట్టుకున్నారు. అతడిని చితకబాది.. పోలీసులకు సమాచారం అందించారు. చివరికి పోలీసులకు అప్పగించారు.
కొద్దిసేపటికి.. బాధితురాలి కుటుంబం.. నిందితుడి ఇంటిపైకి వెళ్లింది. ఆ సమయంలో.. నిందితుడి తండ్రి.. వారిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన కుమారుడిపై కేసు వేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడు, అతడి తండ్రిని అరెస్ట్ చేశారు.
సంబంధిత కథనం