Sunday Motivation : సౌకర్యాలు లేవని అక్కడే ఆగిపోకు.. ఇదిగో ఓ ఐఏఎస్ కథ చదవండి
Sunday Motivation : కొంతమందికి జీవితంలో ఏదో చేయాలని తపన ఉంటుంది. కానీ ఇది లేదు.. అది లేదు అని ఉన్నచోటే ఆగిపోతారు. అక్కడే ఉండిపోతారు. సౌకర్యాలు లేనివాళ్లు కూడా విజయాలు సాధించారు.
చదువుకునేందుకు సౌకర్యాలు లేవు, మా ఇంట్లో వాళ్లు ఎక్కువగా చదివించేందుకు ఇంట్రస్ట్ చూపించరు. అవి కొనివ్వరు.. ఇవి కొనివ్వరు.. ఇలానే చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. అయితే సౌకర్యాలు అనేవి తాత్కాలికం.. లక్ష్యం అనేది శాశ్వతం. ఎలాంటి సౌకర్యాలు లేని ఓ వ్యక్తి సివిల్స్ సాధించాడు. అది కూడా రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఉపయోగించుకోని.. ఒక్కసారి ఆ కథ చూడండి.
కేరళలోని మున్నార్ జిల్లాకు చెందిన శ్రీనాథ్ మొదట్లో ఎర్నాకులంలో కూలీగా పనిచేసేవాడు. అయితే, 2018లో, తన సంపాదన తన కుటుంబ భవిష్యత్తు ఖర్చులకు సరిపోదని గ్రహించాడు. తన ఆర్థిక స్థోమత తన కూతురి భవిష్యత్తును పరిమితం చేయకూడదనుకున్నాడు శ్రీనాథ్. డబుల్ షిఫ్టులలో పనిచేయడం ప్రారంభించాడు. రోజుకు రూ.400-500 కూలి పని చేసేవాడు. విషయాలు కఠినంగా అనిపించాయి. అయితే తన పరిస్థితిని మార్చుకోవాలనే కోరిక శ్రీనాథ్‌కి కలిగింది.
సివిల్ సర్వీస్ పరీక్షకు ప్రిపరేషన్ ప్రారంభించాడు. కానీ తనకున్న పరిమిత వనరులతో శ్రీనాథ్ భారీ ట్యూషన్ ఫీజులను భరించలేకపోయాడు. భారీ కోచింగ్ ఫీజులు, ఖరీదైన స్టడీ మెటీరియల్స్ ఖర్చు కాకుండా, శ్రీనాథ్ తన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాడు. రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఉపయోగించుకున్నాడు.
తన కృషి, అంకితభావంతో శ్రీనాథ్ KPSCలో ఉత్తీర్ణత సాధించాడు. అతనికి స్థిరమైన ఉద్యోగం వచ్చింది. కానీ అతడి కోరిక నెరవేరలేదు. సివిల్స్ ప్రిపరేషన్‌ను కొనసాగించాడు. UPSC కోసం సిద్ధమయ్యాడు. ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి శ్రీనాథ్ తన కలను నెరవేర్చుకున్నాడు. రైల్వే స్టేషన్‌లో కూలీగా పని చేసి.. సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించాడు. అతని అద్భుతమైన ప్రయాణం లక్షలాది మంది స్ఫూర్తిదాయకం.
చూశారుగా.. సౌకర్యాలు లేకున్నా.. శ్రీనాథ్ ఐఏఎస్ సాధించారు. కావాల్సింది సంకల్పం. సాధించాలనే తపన. ఒక్కసారి విజయం సాధిస్తే.. మీకు కావాల్సిన సౌకర్యాలు వద్దు అని చెప్పినా మీ దగ్గరకు వస్తాయి. అందుకే పోరాడు.. సాధించు..!
డబ్బుతో ఏమైనా కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం కానీ.. మనిషిని కొనగలరు. కానీ ఆశయాన్ని కొనలేరు. డబ్బుతో ఏమైనా చేయోచ్చు అనుకోకండి. కొన్ని కొన్ని సాధించాలంటే.. మీ మనసులో లక్ష్యం పుట్టాలి. అప్పుడు ఎలాంటి సౌకర్యాలను కూడా మీరు ఆలోచించరు.
ఉషోదయపు కిరణాలు తనువును తాకగా, నవోదయపు ఆశలు మదిలో చిగురించగా, వాటి కోసం ఈ రోజు ప్రయత్నం ఆరంభించు..!
క్షణాలు గడిచే కొద్దీ ఎండ వేధిస్తున్నా.., కష్టాలు గుండెను బాధిస్తున్నా.., మెుదలెట్టిన పనిని కొనసాగించు..!
సమస్యలు మన మెదడును చుట్టుముట్టినా.., చిగురించిన ఆశలన్నీ ఆవిరవుతున్నా.. గెలుపు కోసమే శ్రమించు..!
నిన్నటి తప్పులను సరిదిద్దుకుంటూ.., రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ.., చేరే గమ్యానికి బాటలు పరుచు..!