Ice Bath Recovery । శీతల స్నానం చేస్తున్న సమంత.. ఈ థెరపీతో ప్రయోజనాలు ఇవే!-samantha ice bath recovery what are the benefits here is all details you need to know about this therapy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Samantha Ice Bath Recovery, What Are The Benefits, Here Is All Details You Need To Know About This Therapy

Ice Bath Recovery । శీతల స్నానం చేస్తున్న సమంత.. ఈ థెరపీతో ప్రయోజనాలు ఇవే!

Manda Vikas HT Telugu
May 03, 2023 11:18 AM IST

Samantha Ice Bath Recovery: నటి సమంత శీతల స్నానం చేస్తూ చికిత్స పొందుతున్నట్లు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా శీతల స్నానం ఎందుకు చేస్తారు? దీని ప్రయోజనాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Samantha Ice Bath Recovery
Samantha Ice Bath Recovery (Instagram/istock)

Samantha Ice Bath Recovery: నటి సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) శీతల స్నానం చేస్తూ చికిత్స పొందుతున్నట్లు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా శీతల స్నానం ఎందుకు చేస్తారు? దీని ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సమంత 'సిటాడెల్' అనే ఇండియన్ థ్రిల్లర్ టీవీ- వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇందులో గూఢచారి పాత్రలో నటిస్తున్న ఆమె, భారీ యాక్షన్ స్టంట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రాక్టీస్ సెషన్‌లు, తీవ్రమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీరం తీవ్రంగా అలసిపోతుంది. కండరాలు దెబ్బతింటాయి. దీని నుంచి కోలుకునేందుకు ఆమె శీతల స్నానం చికిత్సను ఎంచుకున్నారు. మరోవైపు సమంత మయోసైటిస్ (Myositis) నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే.

What Is Ice Bath Recovery- ఐస్ బాత్ రికవరీ అంటే ఏమిటి?

చాలా మంది ప్రొఫెషనల్ అథ్లెట్లు మంచు గడ్డలతో నింపిన బాతింగ్ టబ్ లో తమ శరీరాలను ఉంచి సేదతీరుతారు. ఈ పద్ధతిని కోల్డ్ వాటర్ ఇమర్షన్ (CWI) అని కూడా పిలుస్తారు. చికిత్సలో భాగంగా 50-59 డిగ్రీల ఫారెన్‌హీట్ మధ్య ఉండే చల్లటి అనుభూతిని శరీరానికి కల్పిస్తారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ అభ్యాసం జరుగుతుంది. అయితే ఈ చికిత్స తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సిఫారసు చేస్తారు.

Ice Bath Recovery Benefits- శీతల స్నానం ప్రయోజనాలు

కఠిన వ్యాయామాలు (Intense Exercises) చేసినపుడు, హార్డ్-కోర్ శిక్షణ పొందినపుడు లేదా శరీరం ఎక్కువగా శ్రమకోర్చినపుడు కండరాలలో నొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల వాపులు వేధిస్తాయి. అంతర్గతంగా గాయాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో శరీరం వేగంగా కోలుకోవాలంటే అందుకు శీతల స్నానం చేయాలి. ఈ ఐస్ బాత్ థెరపీ మీ నొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరం చల్లటి అనుభూతికి గురికావడం వలన వాగస్ నాడి సక్రియం అవుతుంది, రక్తనాళాలు సంకోచం చెందుతాయి, రక్తప్రసరణ వేగం తగ్గుతుంది, హృదయ స్పందన రేటు నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో నొప్పి, వాపులను తగ్గించడంలో సహాయపడే అడిపోనెక్టిన్ హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది.

ఐస్ బాత్ థెరపీ చికిత్స శారీరక సమస్యలకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిరూపితమైంది. ఐస్ బాత్ థెరపీ నాడీ వ్యవస్థపై ప్రశాంత ప్రభావాలను చూపుతుంది, మనసుకు ఓదార్పునిస్తుంది, నిరంతరమైన ఆలోచనల నుంచి తలను చల్లబరుస్తుంది, మనసును తేలిక చేస్తుంది ఈ రకంగా కోల్డ్ థెరపీ మానసిక చురుకుదనాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. మరిన్ని ప్రయోజనాలు పరిశీలిస్తే..

  • ఐస్ బాత్ థెరపీ తీవ్రమైన శిక్షణ తర్వాత కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ఇది శరీరానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది.
  • అలసటను తొలగించి, మంచి నిద్రకు ప్రేరేపిస్తుంది. తద్వారా నాడీ వ్యవస్థ రికవరీకి కూడా సహాయపడుతుంది.
  • ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది
  • శరీరం స్థితిస్థాపకత, ఒత్తిడిని నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
  • చల్లటి నీటికి గురికావడం వల్ల శరీరంలో మానసిక స్థితిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి.
  • కండరాలకు ఆక్సిజన్, పోషకాలను కూడా అందిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Ice Bath Recovery Side Effects- దుష్ప్రభావాలు

హృదయ సంబంధ వ్యాధులు లేదా అధిక రక్తపోటు (Hypertension) ఉన్నవారు ఐస్ బాత్ థెరపీ తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మంచు స్నానాలు వారికి ప్రమాదకరం. అలాగే శరీరం ఒకేసారి అల్పోష్ణస్థితికి దారితీయడం కూడా అత్యవసర పరిస్థితి. కాబట్టి వైద్యుల, నిపుణుల పర్యవేక్షణలో లేదా వారి సూచనల మేరకే. ఈ చికిత్స తీసుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం