Period Cramps Remedies । పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం 5 చిట్కాలు!
Period Cramps Home Remedies: మహిళలకు పీరియడ్ సమయంలో, గర్భాశయ కండరాలు సంకోచానికి గురవుతాయి. దీనివల్ల నొప్పి అనేది మొదలవుతుంది. ఈ నొప్పిని ఎదుర్కోవడానికి ఇంటి నివారణలు ఇక్కడ తెలుసుకోండి.
Menstruation: పీరియడ్స్ అనేవి మహిళలు ప్రతీనెలా ఎదుర్కొనే ఒక సమస్య. ఈ సమయంలో వారికి అసౌకర్యంతో పాటు, పొత్తికడుపులో నొప్పి కూడా ఉంటుంది. అయితే ఈ నొప్పి అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరికి నొప్పి భరించే స్థాయిలోనే ఉంటుంది. మరికొందరికి రుతుస్రావం ప్రారంభమయిన రోజు నుంచి ఐదు రోజుల వరకు భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో కలిగే హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఒత్తిడి, ఆందోళన కూడా ఉంటుంది.

పీరియడ్ సమయంలో, గర్భాశయ కండరాలు సంకోచానికి గురవుతాయి. దీనివల్ల నొప్పి అనేది మొదలవుతుంది, ఋతు చక్రంలో స్త్రీల అండాశయాలలో ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇదే ఆ ప్రాంతంలో నొప్పికి దోహదపడుతుంది. అయితే పీరియడ్స్ సమయంలో నొపి రావడం అంటే గర్భాశయ కండరాలు సక్రమంగా పనిచేస్తున్నట్లు భావించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
Period Cramps Home Remedies- ఋతు తిమ్మిరికి నివారణ చిట్కాలు
కొద్ది శాతం మంది స్త్రీలు మాత్రమే వారి దైనందిన జీవితానికి అంతరాయం కలిగించే విధంగా తీవ్రమైన ఋతు తిమ్మిరి (Period Pain)తో బాధపడుతున్నారు. ఏది ఏమైనా, ఈ నొప్పిని ఎదుర్కోవడానికి ఇంటి నివారణలు ఇక్కడ తెలుసుకోండి.
పుష్కలంగా నీరు తాగండి
పీరియడ్స్ సమయంలో నీరు బాగా తాగండి. ఈ సమయంలో నీటిని తీసుకోవడం తగ్గించవద్దు. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ఈ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. అదే సమయంలో కాఫీ, టీలకు, ఇతర కెఫిన్ పానీయాలకు, ఆల్కాహాల్ పానీయాలకు దూరంగా ఉండాలి. అయితే కొన్ని హెర్బల్ టీలు తాగటం వలన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
బెల్లం
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కెమికల్ స్టడీస్ ప్రకారం, ఋతు చక్రంలో రక్తం కోల్పోవడం వలన బలహీనంగా, శక్తి లేనట్లుగా అనిపిస్తుంది. దీనిని నివారించడానికి బెల్లం ప్రభావవంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా బెల్లం తినడం వలన శక్తిని తిరిగిపొందవచ్చు. బెల్లం సోడియం , పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది పొత్తికడుపు నొప్పినితగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటిస్పాస్మోడిక్ లక్షణాలను కూడా కలిగి ఉంది.
నూనెలతో మసాజ్ చేయడం
ఋతుస్రావం సమయంలో నొప్పి నుంచి ఉపశమనం కోసం మసాజ్ థెరపీ ప్రభావవంతంగా ఉంటుంది. లావెండర్, రోజ్, లవంగం, దాల్చినచెక్క వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ పొత్తికడుపుపై మసాజ్ చేసినప్పుడు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ నూనెలను నేరుగా అప్లై చేయకుండా, ముందుగా కొబ్బరి నూనెను ఆప్లై చేసి ఆపైన ఎసెన్షియల్ ఆయిల్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు, తద్వారా తిమ్మిరిపై మసాజ్ ప్రభావం పెరుగుతుంది.
హీటింగ్ ప్యాడ్ వాడండి
పొత్తికడుపు చుట్టూ చుట్టి ఉండే హీటింగ్ ప్యాడ్‌ను ఉపయోగించడం చేయాలి. ఇది ఉదర ప్రాంతాన్ని వెచ్చగా ఉంచుతాయి. సరైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది, నొప్పిని తగ్గిస్తుంది. ఎవిడెన్స్-బేస్డ్ నర్సింగ్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు తిమ్మిరిని తగ్గించడంలో హాట్ కంప్రెస్‌లు లేదా హీటింగ్ ప్యాడ్‌ల వాడకం ప్రభావవంతంగా పనిచేస్తుంది. నొప్పి నివారణ మందులు, ఇబుప్రోఫెన్‌లతో పోలిస్తే మహిళలు హీటింగ్ ప్యాడ్‌ల నుండి ఎక్కువ ఉపశమనం పొందుతారని ఈ పరిశోధన చూపిస్తుంది.
విశ్రాంతి తీసుకోండి
నొప్పి నివారణకు తగినంత విశ్రాంతి అవసరం. డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు ఏవైనా ఒత్తిడిని అరికట్టడంలో , మీ మనస్సు , శరీరాన్ని విశ్రాంతిని ఇవ్వడంలో హాయపడవచ్చు, తద్వారా మీకు పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగి ఉంటారు, వాటిలో ఒకటి విపరీతమైన పీరియడ్ నొప్పి. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా హాయిగా నిద్రపోవాలి.
సంబంధిత కథనం