Body Odour Control : చెమట దుర్వాసన వస్తుందా? ఇదిగో ఇలా చేసేయండి-how to control body odour here s home remedies works effectively ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Body Odour Control : చెమట దుర్వాసన వస్తుందా? ఇదిగో ఇలా చేసేయండి

Body Odour Control : చెమట దుర్వాసన వస్తుందా? ఇదిగో ఇలా చేసేయండి

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 11:45 AM IST

Sweat Smell From Body : సమ్మర్ వచ్చేసింది. చెమటతో శరీరం చికాకుగా అనిపిస్తుంది. అయితే కొంతమంది చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. మరికొంతమంది అన్ని కాలాల్లోనూ చెమట దుర్వాసన ఇబ్బంది కలిగిస్తుంది.

చెమట వాసన
చెమట వాసన (pixabay)

మనిషికి చెమట(Sweat) రావడం సహజం. అయితే కొంతమంది నుంచి వచ్చే చెమట ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దుర్వాసన(Bad Smell) వచ్చేసరికి.. ఏం చేయాలో అర్థంకాదు. పక్కన ఉన్న వారు ఏం అనుకుంటారోనని ఫీల్ అవుతుంటారు. దుర్వాసన వస్తే.. మనతోపాటుగా మన పక్కన ఉండేవాళ్లు కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు. శరీరం(Body) నుంచి దుర్వాసన వచ్చేందుకు ప్రధాన కారణం చెమటే. ఈ చెమటకు ఉప్పు, బ్యాక్టీరియా(Bacteria) వంటివి చేరడం కారణంగా దుర్వాసన వస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు కారణంగా కూడా శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.

కొంతమంది జన్యుపరంగా కూడా ఈ దుర్వాసన సమస్యను ఎదుర్కొంటారు. అయితే దీని నుంచి బయటపడేందుకు డియోడ్రెండ్, ఫర్ ప్యూమ్స్(perfumes) వాడుతుంటారు. కానీ అవి తాత్కలికమే. సరే.. మంచి వాసన వచ్చి.. పక్క వాళ్లకి కూడా హాయిగా అనిపించొచ్చు. కానీ వాటి ద్వారా వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ఎక్కువగా కెమికల్స్(Chemicals) ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే.. చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

అయితే కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి.. చెమట దుర్వాసన సమస్య నుంచి బయటపడొచ్చు. చెమట వాసనను తొలగించడంలో నిమ్మకాయ(Lemon) సమర్థవంతంగా పని చేస్తుంది. స్నానం చేసే సమయంలో నీటిలో నిమ్మరసాన్ని వేసి కలిపి స్నానం చేయాలి. ఇలా చేస్తే.. శరీరం నుంచి చెమట వాసన రాదు.

చాలా మంది సువాసనలు వచ్చే సబ్బు(Soap)ను వాడేందుకే ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న సబ్బును వాడటం మంచిది. సువాసన వచ్చే పౌడర్స్, మాయిశ్చరైజేషెన్స్ ఉపయోగించడం తగ్గించాలి. గ్రీన్ టీ(Green Tea)ని వాడటం కూడా మంచిదే. స్నానం చేసే నీటిలో గ్రీన్ టీని వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే.. శరీరంపై బ్యాక్టీరియాలు నశించి.., దుర్వాసన రాకుండా చేస్తుంది. ఫుడ్(Food) విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వాసన వచ్చేవారు.., మాంసం, మ‌సాలా వంట‌కాల‌ను, ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.

ఎక్కువ నీటి(Water)ని తాగాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. స్నానం చేసే ముందు శ‌రీరానికి కొబ్బరి నూనే రాసుకుంటే మంచిది. అరగంట తర్వాత స్నానం చేయాలి. దీనిద్వారా చర్మం తేమగా ఉంటుంది. దుర్వాసన రాకుండా ఉంటుంది. సోంపు గింజలు నానబెట్టిన నీటిని ప్రతిరోజూ తాగాలి. ఇలా చేస్తే.. శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయి.

WhatsApp channel

టాపిక్