Body Odor Preventing Tips । శరీర దుర్వాసనను సహజంగా నివారించేందుకు ఇవిగో చిట్కాలు!
Body Odor Preventing Tips: శరీరం నుంచి వచ్చే చెమట, దుర్వాసన చాలా ఇబ్బందికరమైన సమస్య. డియోడరెంట్ల ప్రభావం కొద్దిసేపే ఉంటుంది, శరీర దుర్వాసనను సహజంగా నివారించేందుకు ఈ చిట్కాలు పాటించండి.
శరీర దుర్వాసన అనేది ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవటానికి, ప్రజలు వివిధ రకాల అత్తర్లు, డియోడరెంట్లు, పౌడర్లను ఉపయోగిస్తారు. అయితే, వీటన్నింటి ప్రభావం కొంత సమయం వరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ శరీరం నుండి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. చేతులు కూడా పైకి లేపని పరిస్థితి ఉంటుంది. శరీర దుర్వాసన కారణంగా చుట్టూ ఉన్నవారు ఎక్కువగా ఇబ్బంది పడతారు, మీ నుంచి దూరంగా జరుగుతారు. కాబట్టి ఇదొక అసహ్యకరమైన సమస్య, దీనికి సరైన పరిష్కారం కనుగొనడం చాలా ముఖ్యం.
ట్రెండింగ్ వార్తలు
శరీరం నుండి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం చెమట. వివిధ పనులు చేస్తున్నపుడు శరీరం నుండి క్రమంగా చెమట ఉత్పత్తి అవుతుంది. కొందరిలో ఈ చెమట సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా కూడా శరీరం నుంచి వచ్చే చెమట వాసన మరింత ఘాటుగా వస్తుంది. ఇప్పుడు రానున్నది ఎండాకాలం, చెమట మరింత ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల కేవలం డియోడరెంట్ల మీద ఆధారపడకుండా సహజ మార్గాలలో శరీర దుర్వాసనను దూరం చేసుకోవడం ఉత్తమం.
Body Odor Preventing Tips- శరీర దుర్వాసనను నివారించే చిట్కాలు
శరీర దుర్వాసనను సహజంగా నివారించేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి, వీటిని అనుసరించి చూడండి.
ఎక్కువ నీరు త్రాగాలి
ప్రతిరోజూ తగినంత మోతాదులో నీరు తాగుతూ మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. నీరు బాగా త్రాగితే, అది శరీరంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది క్రిములను కూడా శుభ్రపరుస్తుంది. ఫలితంగా శరీర దుర్వాసన బలమైన వాసనను ఉత్పత్తి చేయదు. నీరు ఒక న్యూట్రలైజర్, కాబట్టి ఇది పేగులలో బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది.
రోజూ స్నానం చేయండి
కొంతమందికి రోజూ స్నానం చేసే అలవాటు ఉండదు, కేవలం శరీరానికి డియోడరెంట్లు కొడుతూ మెనేజ్ చేస్తారు. కానీ దీని వల్ల శరీరం శుభ్రపడదు, దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. మీరు శరీర దుర్వాసనను నిర్మూలించాలనుకుంటే, రోజూ రెండు సార్లు స్నానం చేయండి. మీరు స్నానానికి ఏదైనా యాంటీ బాక్టీరియల్ సబ్బును ఉపయోగించవచ్చు. లేదా దోసకాయ, కలబంద, వేప వంటి బాడీ వాష్ కూడా ఉపయోగించవచ్చు. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాను తొలగించి శరీరాన్ని సువాసనగా మార్చడంలో సహాయపడతాయి.
కొబ్బరి నూనె ఉపయోగించండి
కొబ్బరినూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చెడు శరీర దుర్వాసనతో నివారించడంలోనూ సహాయపడుతుంది. స్నానం చేసే ముందు శరీరానికి, అండర్ ఆర్మ్స్ కి కొబ్బరినూనె మర్ధన చేయండి. ఆపై కొద్దిసేపయ్యాక స్నానం చేయండి, ఇది చర్మాన్ని తేమ చేస్తుంది, దుర్వాసనను తొలగిస్తుంది.
వంట సోడా
శరీర దుర్వాసనను ఎదుర్కోవడానికి, మంచి వాసన వచ్చేలా చేయడానికి మీరు బేకింగ్ సోడా, మొక్కజొన్న పిండిని పేస్ట్ చేసి ఉపయోగించవచ్చు. దీన్ని అప్లై చేసిన తర్వాత శరీరంలోని ఏదైనా భాగంలో మంటగా ఉంటే, వెంటనే శుభ్రం చేసి, ఆపై కొబ్బరి నూనె రాయండి. శరీరం అంతటా వర్తించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడానికి ప్రయత్నించండి.
వేపాకు మిశ్రమం
వేపలోని ఔషధ గుణాలు అందరికీ తెలిసిందే. గుప్పెడు వేప ఆకులను నీటితో కలిపి పేస్ట్ చేయండి. దానిని శరీరంలోని వివిధ మడతలపై, మెడ వద్ద, చంకల వద్ద అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత నీళ్లతో కడిగేసుకొని శుభ్రంగా స్నానం చేయాలి. ఇది మీ శరీరం నుంచి దుర్వాసన రాకుండా అడ్డుకోలదు.
ఆహారంలో చేర్చుకోవాల్సినవి
సోంఫు తినడం ద్వారా శరీరం నుండి ఈ టాక్సిన్స్ ను తొలగిస్తుంది. రోజూ ఉదయాన్నే సోంఫ్ విత్తనాలు నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. సిట్రస్ పండ్లు మంచి రుచినే కాదు, మంచి సువాసనను కలిగి ఉంటాయి. సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా శరీర దుర్వాసనను కూడా తగ్గుతుంది. గ్రీన్ టీ బరువు తగ్గించడమే కాకుండా శరీర దుర్వాసనను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు నోరు, చర్మ దుర్వాసనను తొలగిస్తాయి.
సంబంధిత కథనం
Elon Musk's Burnt Hair Perfume వాసన అలా ఉంటుంది, దీని ధర ఎంతంటే?
October 13 2022